డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. తెలుగుతోపాటు.. తమిళంలోనూ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. చివరిసారిగా ది నైట్ మేనేజర్ వెబ్ సిరీస్‌లో కనిపించింది. అయితే ఈ సిరీస్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న శోభితా.. తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనలను గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు అందంగా.. ఆకర్షణీయంగా లేనని ప్రముఖ బ్రాండ్ తనను బ్యాగ్రౌండ్ మోడల్‌గా కూడా సెలక్ట్ చేయలేదని.. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‌కు తాను బ్రాండ్ అంబాసిడర్‌గా సంతకం చేసినట్లు అప్పటి రోజులను గుర్తుచేసుకుంది.
శోభితా మాట్లాడుతూ.. “నేను అందంగా.. ఆకర్షణీయంగా లేనని నన్ను కేవలం బ్యాగ్రౌండ్ మోడల్‌గా కూడా సెలక్ట్ చేయలేదు. కానీ మూడేళ్ల తర్వాత అదే బ్రాండ్‌కు నేను బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేశాను. ప్రస్తుతం ఐశ్యర్య రాయ్ బచ్చన్‌తో షాంప్స్ యాడ్ చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.
శోభితా నటించిన ది నైట్ మేనేజర్ అనేది ఒక క్రైమ్ డ్రామా. ఇందులో కావేరి పాత్రలో కనిపించింది శోభితా. అలాగే స్వస్తా ఛటర్జీ, రవి బెహ్ల్, తిలోతమా షోన్ నటిస్తున్నారు. ది నైట్ మేనేజర్ ఫిబ్రవరి 17 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నైట్ మేనేజర్ సీజన్ 2 ఈ ఏడాది జూన్ లో స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.