Dushara Vijayan: స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్.. అంత పొగరు ఎందుకు నీకు ?.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..

చిన్న సినిమాతో కెరీర్ ఆరంభించిన అమ్మాయికి ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ ఇస్తాం అంటే నమ్ముతారా ఎవరైనా. అస్సలు నమ్మదగిన విషయం కాదు కదా..

Dushara Vijayan: స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్.. అంత పొగరు ఎందుకు నీకు ?.. హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు..
Dushara Vijayan

Updated on: Jul 28, 2021 | 7:39 PM

చిన్న సినిమాతో కెరీర్ ఆరంభించిన అమ్మాయికి ఓ స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ ఇస్తాం అంటే నమ్ముతారా ఎవరైనా. అస్సలు నమ్మదగిన విషయం కాదు కదా.. తను కూడా అలాగే అనుకుందట. కొందరు అలా ఫ్రాంక్ కాల్ చేసి ఆటపట్టిస్తున్నారనుకుందట. కానీ తర్వాత అసలు విషయం తెలుసుకుని ఖంగుతిన్నాను అంటూ చెప్పుకొచ్చింది యువ కథానాయిక దుషార విజయన్. ఈ అమ్మడు హీరోయిన్‏గా నటించిన సార్పట్ట తాజాగా ఓటీటీలో విడుదలై సూపర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ మూవీ అందించిన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు దుషార విజయన్.

దుషార విజయన్ మాట్లాడుతూ.. దిండుగల్ జిల్లా కన్యాపురం అనే చిన్న గ్రామానికి చెందిన నేను ఫ్యాషన్ డిజైనర్ గా కెరీర్ కొనసాగిస్తున్న సమయంలో అనూహ్యంగా నటిగా ఆఫర్ వచ్చింది. సినిమాలలో ఆఫర్ల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా డైరెక్టర్ రంజిత్ పా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. అవతలి నుంచి ఫోన్‏లో మాట్లాడిన వ్యక్తి మీరు రంజిత్ పా తీయబోతున్న సినిమాలో నటించేందుకు ఆడిషన్స్ ఇవ్వాల్సి ఉంది రండీ అంటూ పిలిచారు. ఆ సమయంలో నేను నమ్మలేదు.. ఫ్రాంక్ అని వెళ్లలేదు. ఆ తర్వాత రెండు రోజులకు మళ్లీ రంజిత్ సర్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. ఏమ్మా.. అంత పొగరు ఎందుకు నీకు సర్ ఆఫీస్ నుండి అంటూ చెప్పినా కూడా నువ్వు పట్టించుకోకుండా రాలేదు. ఎంత మంది ఇలాంటి ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా అంటూ అవతలి వ్యక్తి కాస్త సీరియస్ గానే అరిచాడు. దాంతో నేను వెంటనే రంజిత్ సర్ ఆఫీస్ కు వెళ్లాను.. అలా అలా నాకు ఆఫర్ వచ్చిందని దుషారా చెప్పుకొచ్చింది.

కోలీవుడ్ హీరో ప్రధాన పాత్రలో నటించిన సర్పట్టపరంబరై జూలై 22 అమెజాన్ ప్రేమ్ వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. 1970ల నాటి నార్త్ మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. అటు సార్పట్ట సినిమాకు వచ్చిన అవకాశంను నూటికి నూరు శాతం నటిగా నిరూపించుకుంది దుషార విజయన్. ఈమెకు మంచి భవిష్యత్తు ఉంది అంటూ నెటిజన్స్ మాట్లాడుకునేలా చేసింది.

Also Read: Rashmika Mandanna: తగ్గేదే లే అంటున్న రష్మిక.. చేతిలో అర డజన్‏కు పైగా సినిమాలు.. మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కన్నడ బ్యూటీ..

R Narayana Murthy: ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సంచలన కామెంట్స్

Loading...
Unable to load recommendations.
Follow Us