Anasuya Bharadwaj : బుల్లితెరపైన అందాల యాంకర్ గా రాణిస్తున్న ముద్దుగుమ్మ అనసూయ. తనదైన యాంకరింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది అనసూయ. అటు యాంకరింగ్ తో పాటు సినిమాల్లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో అనసూయ కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. రంగమ్మత్త గా అనసూయ అదరగొట్టింది. ఆసినిమా తర్వాత చాలా సినిమాల్లో నటించింది. ఇక అడవి శేష్ నటించిన క్షణం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇటీవల యంగ్ హీరో కార్తికేయ నాటింక్ఝిన చావు కబురు చల్లగా సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది అనసూయ.
ఇలా బుల్లితెరపైన వెండితెరపైన తనదైన ముద్రవేస్తుంది అనసూయ. ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన వ్యక్తిగత విషయాలతోపాటు, సినిమాకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది అనసూయ. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. నాగచైతన్య, పూజ హెగ్డే కలిసి నటించిన ఒక లైలాకోసం సినిమాలోని ఒక డైలాగ్ ను అనుకరిస్తూ అనసూయ ఈ వీడియో చేసింది. నాకెందుకు ప్రపోజ్ చేయలేదు అంటూ హీరోయిన్ అడిగే సన్నివేశానికి అనసూయ తన అభినయాన్ని జోడించింది. దాంతో నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఐ లవ్ యు అనసూయ అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మీకు పెళ్లయింది కదా ఒప్పుకుంటారా లేదో అని ప్రపోజ్ చేయలేదు అంటూ కొంటెగా కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అటు అనసూయ టీవీ షోలతో ఇటు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. త్వరలోనే ఓ తమిళ్ సినిమాలోనూ అనసూయ నటించనుందని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయం పై ఇంతవరకు క్లారిటీ రాలేదు.
అనసూయ ఇంస్టాగ్రామ్ వీడియో..
మరిన్ని ఇక్కడ చదవండి :
అందాల బుట్టబొమ్మకు ఆఫర్ల వెల్లువ.. మూడు భాషల్లో రాణించాలని చూస్తున్న ముద్దుగుమ్మ..
Raashi Khanna: మరోసారి అక్కినేని యంగ్ హీరోతో అందాల రాశిఖన్నా.. ఏ సినిమాలో అంటే