MS Dhoni Meets Vijay: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని తమిళ స్టార్ హీరో విజయ్‌కు షాక్ ఇచ్చారు. ఏకంగా విజయ్ సెట్లోకి అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం విజయ్ బీస్ట్ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా చెన్నైలోని గోకులం స్టూడియోలో జరుగుతోంది. కాగా, ఓ యాడ్ షూటింగ్‌లో భాగంగా మిస్టర్ కూల్ గోకులం స్టూడియోకి చేరుకున్నాడు. దీంతో విజయ్ కొత్త సినిమా షూటింగ్ విషయం తెలుసుకుని సెట్‌కి వెళ్లాడు.
ఈ మేరకు వీరిద్దిర ఫొటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఇద్దరు లెజెండ్స్ ఇకే ఫ్రేములో కనిపించడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మాస్టర్‌తో బ్లాస్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్‌కి సంబంధించిన యాడ్ షూటింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Also Read:
Salman Khan: పాపం ఫోటోతో బుక్కయిపోయిన సల్లూ భాయ్.. రాచిరంపాన పెడుతున్న నెటిజన్స్