Chakkora Review: చకోర సినిమా రివ్యూ.. పూరీ జగన్నాథ్ శిష్యుడి సినిమా మెప్పించిందా..?

ఆదర్శ కుటుంబం వాయిదాతో ఈ వారం అన్నీ చిన్న సినిమాలే వచ్చాయి. అలా వచ్చిన సినిమానే చకోరా. స్వచ్ఛమైన వర్షపు నీటి కోసం ఎన్నాళ్లైనా వేచి చూసే చకోర పక్షి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు, పూరీ జగన్నాథ్ శిష్యుడు మంగా శ్రీనివాస్.. మరి ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Chakkora Review: చకోర సినిమా రివ్యూ.. పూరీ జగన్నాథ్ శిష్యుడి సినిమా మెప్పించిందా..?
Chakkora

Edited By:

Updated on: Oct 09, 2026 | 3:23 PM

మూవీ రివ్యూ: చకోర

నటీనటులు: శ్రవణ్, మలైకా టి. వాసుపల్, ఇంద్రజ, సుమన్‌, బ్రహ్మాజీ, ఎల్‌బీ శ్రీరామ్‌ తదితరులు

ఎడిటర్: మార్తండ్ కే వెంకటేష్

సినిమాటోగ్రఫీ: రుప్ప గోపీకృష్ణ

సంగీతం: ప్రిన్స్ హెన్రీ

దర్శకుడు: మంగా శ్రీనివాస్

నిర్మాత: డాక్టర్ చింతాడ హేమారావు

కథ:

రాజమండ్రి బ్యాక్ డ్రాప్‌లో ఫైనాన్స్ బిజినెస్ చేసుకుంటూ లైఫ్‌ను చిల్ అవుతుంటాడు కుర్రాడు రావణ బ్రహ్మ (శ్రవణ్). చిన్నతనంలో తన తల్లి చెప్పిన చందమామ కథలకు బాగా ఎట్రాక్ట్ అయిన అతడు, తన లైఫ్ పార్టనర్ కూడా అచ్చం జాబిలి లాగే ఉండాలని కలలు కంటుంటాడు. ఆ టైమ్‌లోనే మెడిసిన్ చదివే జూలీ అలియాస్ జాబిలి (మలైకా టి వాసుపల్‌) పరిచయం అవుతుంది. తాను అనుకున్న క్వాలిటీస్ అన్నీ ఆమెలో కనిపించడంతో ఫస్ట్ సైట్‌లోనే లవ్‌లో పడిపోతాడు. ఆమెను ఇంప్రెస్ చేయడానికి రకరకాల ట్రయల్స్ వేస్తాడు. ఫైనల్‌గా ఇద్దరూ క్లోజ్ అవుతారు. అయితే హీరో తన లవ్‌ను ప్రపోజ్ చేసే టైమ్‌లో హీరోయిన్ ఒక కండిషన్ పెడుతుంది. 24 గంటల పాటు తనతో మాట్లాడకూడదని, అసలు కనిపించకూడదని చెప్పి మాయం అవుతుంది. ఆ తర్వాత హీరో ఆమె కోసం గోవా లాంటి ప్లేసెస్‌లో చకోర పక్షిలా ఎందుకు వెతికాడు? ఆ సెర్చింగ్ టైమ్‌లో హీరోకు కనిపించకుండా హీరోయిన్ ఎందుకు దాక్కుంది? అసలు ఆమె ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటి? వాళ్లిద్దరి లవ్ స్టోరీ చివరకు ఏమైంది? మధ్యలో స్టోరీ నెరేటర్‌గా వచ్చే మరో క్యారెక్టర్ రోల్ ఏంటి? లాంటి క్వశ్చన్స్‌కు ఆన్సర్ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

కథనం:

స్వచ్ఛమైన వర్షపు నీటి కోసమే ప్రాణాలతో వెయిట్ చేసే చకోర పక్షి కాన్సెప్ట్‌ను, ట్రూ లవ్ కోసం ఎదురుచూసే ప్రేమికుల స్టోరీకి లింక్ చేస్తూ డైరెక్టర్ ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేసుకున్నాడు. స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ వరకు మూవీ రొటీన్ ఫార్మాట్‌లోనే రన్ అవుతుంది. క్యారెక్టర్ల ఇంట్రడక్షన్, హీరోయిన్ వెనకాల హీరో పడటం, ఆమెను లైన్‌లో పెట్టడానికి చేసే పనులు ఇవన్నీ రెగ్యులర్ లవ్ స్టోరీలను గుర్తు చేస్తాయి. కథంతా ఒకే పాయింట్ చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ ఎండింగ్‌లో హీరోయిన్ సడెన్‌గా కండిషన్ పెట్టి స్కిప్ అవుతుందో అక్కడి నుంచి సెకండ్ హాఫ్ మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత తన లవర్ కోసం హీరో చేసే జర్నీ, ఆ ప్రాసెస్‌లో అతనికి ఎదురైన సిచ్యువేషన్స్ ఆకట్టుకుంటాయి.
ముఖ్యంగా కంటికి కనిపించకుండా కేవలం మొబైల్ కాల్స్ ద్వారానే లవర్‌తో ప్లే చేసే ఎమోషనల్ గేమ్ ఆడియన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. కాకపోతే హీరోయిన్ ఫేస్ చేస్తున్న అసలు ఇష్యూ ఏంటనేది ముందే ఈజీగా గెస్ చేసేలా ఉండటం స్క్రీన్ ప్లేకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. సస్పెన్స్ ఎలిమెంట్‌ను డైరెక్టర్ పర్ఫెక్ట్‌గా హోల్డ్ చేయలేకపోయాడు. దీనికి తోడు కొన్ని సీన్స్ మళ్లీ మళ్లీ రిపీట్ అవ్వడం కాస్త బోర్ కొట్టిస్తుంది. కానీ క్లైమాక్స్‌లో సెకండ్ హీరోయిన్ ద్వారా రివీల్ అయ్యే మెయిన్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ట్రూ లవ్ కోసం ఎంత కాలమైనా ఓపికగా వెయిట్ చేయాలనే పాయింట్‌ను బాగానే ప్రెజెంట్ చేశారు. పూరీ జగన్నాథ్ స్కూల్ నుంచి వచ్చిన డైరెక్టర్ కావడంతో హీరో క్యారెక్టరైజేషన్‌లో ఆ మార్క్ మాస్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. యూత్ ఆడియన్స్‌కు ఈ మూవీ కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

నటీనటులు:

డెబ్యూ మూవీ అయినా కూడా మెయిన్ లీడ్ రోల్‌లో శ్రవణ్ కాన్ఫిడెంట్‌గా యాక్ట్ చేశాడు. యూత్ ఫుల్ లవ్ స్టోరీ కావడంతో తన క్యారెక్టర్‌ను చాలా ఈజీగా క్యారీ చేశాడు. హీరోయిన్‌గా నటించిన మలైకా తన క్యారెక్టర్ లిమిట్స్ మేరకు ఓకే అనిపిస్తుంది. ఇక నెరేటర్‌గా మూవీ అంతా స్టోరీని రన్ చేసే పాత్రలో అనుష్క లుహార్ యాక్టింగ్ ప్లస్ అయింది. ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్‌ను ఆమె క్యారెక్టర్ ద్వారానే చాలా ఇంట్రెస్టింగ్‌గా రివీల్ చేశారు. హీరో పేరెంట్స్ రోల్స్‌లో బ్రహ్మాజీ, ఇంద్రజ తమ సీనియారిటీతో సినిమాకు సపోర్ట్ ఇచ్చారు. సుమన్ క్యారెక్టర్ కాసేపే ఉన్నా డీసెంట్‌గా అనిపిస్తుంది. మిగిలిన ఆర్టిస్టులు తమ రోల్స్‌కు తగ్గట్టుగా పర్వాలేదనిపించారు.

టెక్నికల్ టీం:

మ్యూజిక్ డైరెక్టర్ ప్రిన్స్ హెన్రీ అందించిన సాంగ్స్ వినడానికి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా లవ్ ఫీల్ ను బాగానే ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ వర్క్ ఈ మూవీకి హైలైట్. వైజాగ్, రాజమండ్రి, గోవా బ్యూటీని కెమెరామెన్ రుప్ప గోపీకృష్ణ చాలా అద్భుతంగా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. ఎడిటింగ్ పర్లేదు.. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బడ్జెట్‌కు తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. లిమిటెడ్ లొకేషన్స్‌లో షూట్ చేసినా క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ రొమాంటిక్ ట్రాక్‌ను బాగానే హ్యాండిల్ చేసినా, ఎమోషనల్ సీన్స్‌ను ఇంకాస్త బలంగా రాసుకుని ఉంటే రిజల్ట్ బెటర్‌గా ఉండేది. ప్రమోషన్స్ గట్టిగా ప్లాన్ చేసుకుంటే బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ దక్కే స్కోప్ ఉంది.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా చకోరా.. కాన్సెప్ట్ మంచిదే కానీ..!

Loading...
Unable to load recommendations.
Follow Us