Ravi Teja: జోష్‌ మీదున్న మాస్‌ మహా రాజా… మరో ప్రాజెక్ట్‌ ప్రకటన. ఒకేసారి మూడు సినిమాలతో..

Ravi Teja: విజయం ఇచ్చే కిక్‌ ఎలా ఉంటుందో ప్రస్తుతం మాస్‌ మహా రాజా రవితేజాను చూస్తే అర్థమవుతోంది. 2017లో వచ్చిన 'రాజా ది గ్రేట్‌' తర్వాత రవితేజ వరుస అపజయాలను ఎదుర్కొంటూ..

Ravi Teja: జోష్‌ మీదున్న మాస్‌ మహా రాజా... మరో ప్రాజెక్ట్‌ ప్రకటన. ఒకేసారి మూడు సినిమాలతో..

Updated on: Oct 02, 2021 | 2:00 PM

Ravi Teja: విజయం ఇచ్చే కిక్‌ ఎలా ఉంటుందో ప్రస్తుతం మాస్‌ మహా రాజా రవితేజాను చూస్తే అర్థమవుతోంది. 2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్‌’ తర్వాత రవితేజ వరుస అపజయాలను ఎదుర్కొంటూ వచ్చారు. ఇలా వరుసగా నాలుగు పరాజయాల తర్వాత వచ్చిన ‘క్రాక్‌’తో ఒక్కసారిగా మళ్లీ ట్రాక్‌లోకి ఎక్కారు రవి. 2020లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఒక్కసారి స్వింగ్‌లోకి వచ్చిన రవితేజ ఆ జోష్‌లో వరుస సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 67వ చిత్రం ‘ఖిలాడి’ని పూర్తి చేసే పనిలో పడ్డ రవితేజ. శరత్‌ మండవ దర్శకత్వంలో 68వ (రామరావు ఆన్‌ డ్యూటీ) చిత్రాన్ని కూడా ప్రారంభించారు.

ఇదిలా ఉంటే రవితేజ ఇంకా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనక ముందే మరో కొత్త సినిమాను రవితేజ పట్టాలెక్కించారు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రవితేజ తన 69వ చిత్రం చేయనున్నారు. ఈ విషయాన్ని రవి తాజాగా.. ట్విట్టర్‌ వేదికగా అధికారింగా ప్రకటించారు. 69వ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను పోస్ట్‌ చేస్తూ.. ‘యాక్షన్‌ మొదలైంది. రోల్‌-కెమెరా-యాక్షన్‌’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చారు.

ఈ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్ నిర్మిస్తున్నారు. ఇలా రవితేజ ఒకేసారి ఏకంగా మూడు వరుస సినిమాలతో జోష్‌ మీదున్నారన్నమాట. ఈ లెక్కన వచ్చే ఏడాదికి మాస్‌ మహా రాజా ఫ్యాన్స్‌కు పండగే అన్నమాట. త్రినాథ రావు నక్కిన ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్‌’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

Also Read: Maa Elections 2021: ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటన.. అనుహ్యంగా ఎన్నికల నుంచి తప్పుకున్న సీవీఎల్..

Kannada Tv Actress Soujanya: యువనటి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. ప్రియుడిపై తండ్రి ఫిర్యాదు..

Varudu Kavalenu: వరుడు కావలెను నుంచి మరో సాంగ్.. ఆకట్టుకుంటున్న వడ్డాణం పాట..

Follow Us