Venkatesh : జయం మనదేరా సినిమాను మార్చేసిన ఆ 10 నిమిషాల సీన్.. లేదంటే ప్లాప్ అయ్యేది.. ఎడిటర్..

టాలీవుడ్‌లో 500లకు పైగా చిత్రాలకు పనిచేసి, దాదాపు 90 శాతం సక్సెస్ రేట్ అందుకున్న దిగ్గజ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ తన సినీ ప్రయాణంలోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'అల్లరి ప్రియుడు'తో మొదలైన కెరీర్, 'జయం మనదేరా' చిత్రంలో 10 నిమిషాల సీన్ వెనుక ఉన్న అసలు కారణం, సురేష్ ప్రొడక్షన్స్ క్రమశిక్షణ గురించి ఆయన చెప్పిన విశేషాలు ఇక్కడ ఉన్నాయి.

Venkatesh : జయం మనదేరా సినిమాను మార్చేసిన ఆ 10 నిమిషాల సీన్.. లేదంటే ప్లాప్ అయ్యేది.. ఎడిటర్..
Jayam Manade Ra Movie

Updated on: Nov 20, 2026 | 8:34 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఒక సినిమా విజయం సాధించడంలో నటీనటులు, దర్శకులతో పాటు ఎడిటర్ పాత్ర కూడా అత్యంత కీలకం. ఎడిటింగ్ టేబుల్ వద్ద కూర్చుని కథా గమనాన్ని, ప్రేక్షకుల భావోద్వేగాలను నియంత్రించగల దిగ్గజాలలో మార్తాండ్ కె. వెంకటేష్ ముందు వరుసలో ఉంటారు. 500లకు పైగా సినిమాలకు పనిచేసిన సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, తాను పనిచేసిన చిత్రాల్లో సుమారు 90 శాతం వరకు విజయాలను అందుకోవడం వెనుక ఉన్న రహస్యాలు, సినీ ప్రయాణంలోని ఆసక్తికరమైన జ్ఞాపకాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మార్తాండ్ కె. వెంకటేష్ కుటుంబానికి సినిమా ఎడిటింగ్ రంగంతో దశాబ్దాల అనుబంధం ఉంది. తండ్రి కూడా ఇదే వృత్తిలో ఉండటంతో చిన్నప్పటి నుంచే ఆ వాతావరణంలో పెరిగారు. హీరో జగపతిబాబు ప్రోత్సాహంతో, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ‘అల్లరి ప్రియుడు’ సినిమాతో వెంకటేష్‌ను ఎడిటర్‌గా పరిచయం చేశారు. కె. రాఘవేంద్రరావునే తన మొదటి గురువుగా ఆయన భావిస్తారు. ఆ తర్వాత వచ్చిన ‘పెళ్లి సందడి’ ఆయన కెరీర్‌లో పెద్ద మలుపుగా నిలిచింది. ముఖ్యంగా ఆ చిత్ర క్లైమాక్స్‌లో మాటలు లేకుండా కేవలం పాటతోనే ఎమోషన్స్ పండించిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రారంభ దశలో తాను చేసిన పది సినిమాల్లో ఏడు బ్లాక్ బస్టర్లు కావడంతో ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది.

ఎక్కువ మంది చదివినవి : KS Chitra : తెలుగులో పెద్ద హీరోయిన్.. ఆమెకు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని.. చిత్ర..

డి. రామానాయుడు, సురేష్ బాబుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, వారిని తన కుటుంబానికి గాడ్ ఫాదర్లుగా వెంకటేష్ తెలిపారు. స్క్రిప్ట్‌పై నమ్మకం, బడ్జెట్ క్రమశిక్షణ, పాత్రకు తగిన నటుడిని ఎంచుకునే పద్ధతి వల్ల సురేష్ ప్రొడక్షన్స్ చిత్రాలు ఆర్థికంగా సురక్షితంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘జయం మనదేరా’ సమయంలో విడుదల ముందు వేసిన షోలో ప్రేక్షకుల స్పందనను గమనించి, ఆ 10 నిమిషాల సీన్ తీసేయడం సినిమాను సేఫ్ జోన్‌లోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఆ సినిమాలో వెంకటేష్ మరణించే సన్నివేశాలకు ప్రేక్షకులు విపరీతంగా ఏడ్చారు. అది సినిమా ఫలితంపై ప్రభావం చూపుతుందని గ్రహించి, అర్ధరాత్రి ఎడిటింగ్ టేబుల్‌పై కూర్చుని దాదాపు 20 నిమిషాల నిడివిని, కొన్ని యాక్షన్ షాట్లను కత్తిరించేశారట అలాగే దర్శకుడు పూరి జగన్నాథ్ సాంకేతిక నిపుణులను నమ్మి ఎడిటింగ్‌లో పూర్తి స్వేచ్ఛ ఇస్తారని ప్రశంసించారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఒక్క పాట కోసం 365 రోజులు థియేటర్లు షేక్ అయ్యాయి.. అప్పట్లో టాప్ లేపేసిన సాంగ్..

సినిమా విజయానికి ఎడిటర్ ఎప్పుడూ ప్రేక్షకుడి కోణంలో ఆలోచించాలని మార్తాండ్ కె. వెంకటేష్ చెబుతారు. ఏ సన్నివేశం చూసినా సాధారణ ప్రేక్షకుడిలా స్పందించగలిగినప్పుడే ఎడిటింగ్ కచ్చితంగా కుదురుతుందని, తన నిక్కచ్చిగా మాట్లాడే తత్వం , కథ పట్ల నిబద్ధతే తన సక్సెస్ రేట్‌కు కారణమని ఆయన స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..

ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..

Loading...
Unable to load recommendations.
Follow Us