చిన్నారిని దత్తత తీసుకున్న ‘సాహో’ నటి

నటి, ఫ్యాషన్ డిజైనర్‌, టెలివిజన్ ప్రజెంటర్ మందిరా బేడీ దంపతులు నాలుగేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 2:13 pm, Tue, 27 October 20
చిన్నారిని దత్తత తీసుకున్న 'సాహో' నటి

Mandira Bedi adopted baby girl: నటి, ఫ్యాషన్ డిజైనర్‌, టెలివిజన్ ప్రజెంటర్ మందిరా బేడీ దంపతులు నాలుగేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నారు. ఇప్పటికే మందిరా, రాజ్‌ కౌషల్‌ దంపతులకు వీర్‌ అనే కుమారుడు ఉండగా.. ఇప్పుడు తారా అనే చిన్నారిని వారు దత్తత తీసుకున్నారు. ఈ విషయాన్ని మందిరా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

”దేవుడి ఆశీస్సులతో ఈ చిన్నారి మా జీవితాల్లోకి వచ్చింది. మా లిటిల్‌ గర్ల్‌ తార. నాలుగేళ్లు దాటిన ఈ చిన్నారి కళ్లు నక్షత్రాల వలే ప్రకాశిస్తుంటాయి. వీర్‌ తన చెల్లిలిని ఎంతో సంతోషంగా, ప్రేమగా ఇంట్లోకి ఆహ్వానించాడు. తారా బేడీ కౌశల్‌.. జూలై 28 నుంచి మా ఇంట్లో భాగం అయ్యింది” అని మందిరా ఓ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆ చిన్నారితో తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. ఆమె పోస్ట్‌కు పలువురు అభినందనలు చెబుతున్నారు.

కాగా దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చిన మందిరా.. సాదీ కా లడ్డూ, బదల్‌,వోడ్కా డైరీస్‌, ఓ తేరీ వంటి చిత్రాల్లో నటించారు. ప్రభాస్ నటించిన సాహోతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే బుల్లితెరపైన పలు సీరియల్స్‌లో, ఓటీటీలో పలు వెబ్‌ సిరీస్‌లో ఆమె నటించారు.

Read More:

శ్యామ్‌ సింగ రాయ్‌: 65 ఏళ్ల వృద్ధుడిగా నాని..!

ట్రాక్టర్ ప్రమాదం.. నారా లోకేష్‌పై కేసు నమోదు

https://www.instagram.com/p/CGxIPeSACRg/?utm_source=ig_embed