మహేష్ ‘సర్కారు వారి పాట’ గురించి ఆసక్తికర విషయం!

ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్‌ని ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ మహేష్‌ బాబు.. తదుపరి చిత్రంగా

మహేష్ 'సర్కారు వారి పాట' గురించి ఆసక్తికర విషయం!
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 03, 2020 | 1:14 PM

Mahesh Sarkaru Vaari Paata: ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్‌ని ఖాతాలో వేసుకున్న సూపర్‌స్టార్ మహేష్‌ బాబు.. తదుపరి చిత్రంగా పరశురామ్‌ దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌, మోషన్ పోస్టర్ ఇప్పటికే విడుదల కాగా.. అందులో సూపర్‌స్టార్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. మెడపైన రూపాయి టాటూ, చెవుకి పోగుతో మహేష్ లుక్ అదరగొట్టగా.. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ మూవీలో మహేష్ బాబు డ్యూయల్ రోల్‌లో కనిపించబోతున్నారట. పాన్ బ్రోకర్‌గా, బ్యాంక్ ఆఫీసర్‌గా మహేష్ ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే చెల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు కొడుకు దిద్దిన కాపురంలో తొలిసారిగా ద్విపాత్రాభినయంలో నటించారు మహేష్‌. హీరోగా మారిన తరువాత ‘నాని’లో డ్యూయల్‌ రోల్‌లో కనిపించినప్పటికీ.. ఆ నిడివి చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఇప్పుడు సర్కారు వారి పాటలో మహేష్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తే.. ఫుల్ లెంగ్త్‌లో డ్యూయల్‌ రోల్‌లో ఆయన నటించే మొదటి చిత్రం ఇదే అవుతుంది.  ఇక కథానుగుణంగా ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకోనున్నట్లు సమాచారం.

కాగా ఈ మూవీలో ఓ హీరోయిన్‌గా కీర్తి సురేష్ కన్ఫర్మ్ కాగా.. మరో హీరోయిన్ కోసం పలువురుతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, మహేష్ బాబు సంయుక్తంగా నటిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందించనున్నారు.

Read More:

 ‘ఇంగ్లీష్ మీడియం’పై సుప్రీం విచారణ.. ‘స్టే’కు నిరాకరణ

పవన్‌కి హీరోయిన్ ఫిక్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu