
సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది మట్టిలోని మాణిక్యాలు బయటకు వస్తున్నారు. పట్నం నుంచి అడవి బిడ్డల వరకు జరిగే ప్రతి చిన్న సంఘటనలు సోషల్ మీడియా వేదికలుగా మారి.. వారి టాలెంట్‌ను ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కళాకారులు తమ టాలెంట్‌తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నారు. తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. అందులో ఓ పల్లెటూరి అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న వీడియోను బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఆ వీడియోలో 1957లో వచ్చిన మదర్ ఇండియాలోని రాజేంద్ర కుమార్, కుమ్ కుమ్ నటించిన గోగత్ నహీన్ అనే పాటకు ఆ అమ్మాయి.. ఎక్కడ తడబడకుండా.. తన ఎక్స్ప్రేక్షన్స్తో సూపర్‌గా డాన్స్ చేసింది. ఈ వీడియోను చూసిన మాధురీ.. ఆ అమ్మాయిపై ప్రశంసలపై ప్రశంసలు కురిపించింది. “వావ్. ఈ అమ్మాయి ఎంత అద్బతంగా డ్యాన్స్ చేస్తోంది. ఇలాంటి టాలెంట్‌ను మనం వెతికి తీయాలి” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మొదటగా రాగిరీ అనే ఒక ఎన్టీవో షేర్ చేస్తూ..నాటి హీరోయిన్స్.. మాధురీ దీక్షీత్, హేమమాలినీలను ట్వీట్ చేస్తూ.. ఈ అమ్మాయి డ్యాన్స్‌కు వారి అభిప్రాయాలు తెలపాలని కోరింది. రాగిరీ సంస్థవారు సంప్రదాయ సంగీతాన్ని, నృత్యాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు.
Also Read:
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రానున్న అక్కినేని హీరో.. టాలెంటెడ్ డైరెక్టర్‌కు ఓకే చెప్పిన చైతూ..