చిరు మూవీకి భారీగానే పుచ్చుకుంటోన్న కొరటాల..?

| Edited By:

Dec 18, 2019 | 10:11 PM

టాలీవుడ్‌లో స్టార్ డైరక్టర్లలో కొరటాల శివ ఒకరు. ప్రభాస్ ‘మిర్చి’తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన కొరటాల.. ఆ తరువాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’లతో వరుసగా నాలుగు సక్సెస్‌లను ఖాతాలో వేసుకొని.. మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిని ఆయన డైరక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం […]

చిరు మూవీకి భారీగానే పుచ్చుకుంటోన్న కొరటాల..?
Follow us on

టాలీవుడ్‌లో స్టార్ డైరక్టర్లలో కొరటాల శివ ఒకరు. ప్రభాస్ ‘మిర్చి’తో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన కొరటాల.. ఆ తరువాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’లతో వరుసగా నాలుగు సక్సెస్‌లను ఖాతాలో వేసుకొని.. మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ల లిస్ట్‌లో చేరిపోయాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవిని ఆయన డైరక్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం చిరు సినిమా కోసం కొరటాలకు భారీగానే ముట్టినట్లు తెలుస్తోంది.

చిరు మూవీ కోసం దాదాపుగా 15కోట్లు కొరటాల పుచ్చుకుంటున్నట్లు టాక్. ఇంతవరకు ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్ కావడంతో.. నిర్మాతలు కూడా ఆ రేటుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణ్ నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. కాగా టాలీవుడ్‌లో ఇప్పుడున్న దర్శకుల్లో దర్శకధీరుడు రాజమౌళి అత్యధిక పారితోషికం అందుకుంటున్నారట. బాహుబలి 1, 2 చిత్రాలకు కలిపి రూ.50కోట్లు తీసుకున్న జక్కన్న.. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లతో తీస్తున్న ఆర్ఆర్ఆర్ కోసం దాదాపుగా రూ.30కోట్లను తీసుకున్నట్లు టాక్. ఇక ఆ దర్శకుడి తరువాత కొరటాల ఉన్నాడని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు అనిల్ రావిపూడి దూసుకువస్తున్నాడు. వరుసగా నాలుగు హిట్లతో జోరు మీదున్న ఈ యువ దర్శకుడు.. ప్రస్తుతం మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరును తెరకెక్కిస్తున్నాడు. ఒకవేళ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయితే.. అతడి రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.