Patalakka Shyama : పాటలక్క శ్యామాగా డీ గ్లామర్ రోల్ లో చేస్తున్న కన్నడ నటి.. రియల్ గా ఎంత అందగత్తో తెలుసా..!

బుల్లి తెరపై వంటలక్కకు పోటీగా పాటలక్క వచ్చింది. ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లో ప్రసారమవుతున్న కృష్ణ తులసి సీరియల్ లో హీరోయిన్ కూడా కలర్ తక్కువగా ఉండి మంచి వ్యక్తిత్వం కలిగి...

Patalakka Shyama : పాటలక్క శ్యామాగా డీ గ్లామర్ రోల్ లో చేస్తున్న కన్నడ నటి.. రియల్ గా ఎంత అందగత్తో తెలుసా..!
Krishna Tulasi Shyama

Updated on: Mar 14, 2021 | 3:19 PM

Patalakka Shyama :  బుల్లి తెరపై వంటలక్కకు పోటీగా పాటలక్క వచ్చింది. ప్రముఖ తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానల్ లో ప్రసారమవుతున్న కృష్ణ తులసి సీరియల్ లో హీరోయిన్ కూడా కలర్ తక్కువగా ఉండి మంచి వ్యక్తిత్వం కలిగి.. కుటుంబానికి ఆసరాగా నిలబడే క్యారెక్టర్. మూర్తీభవించిన వ్యక్తిత్వం, సహనం, సహాయం చేసే గుణం కలిగిన శ్యామా పాత్రలో తెలుగు బుల్లి తెరపై ఓ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్ కే. రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సీరియల్ లో శ్యామగా నటిస్తున్న అమ్మాయి పేరు ఐశ్యర్య. మోడల్ గా రాణించిన ఐశ్యర్య.. నటన మీద ఆసక్తితో బెంగళూరులో యాక్టింగ్ స్కూల్ లో చేరింది. అనంతరం ఓ కన్నడ షార్ట్ ఫిల్మ్ లో నటించింది. తర్వాత ఓ కన్నడ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ లో నటించింది మెప్పించింది. తర్వాత శ్యామా పాత్ర కోసం ఇద్దరు హీరోయిన్లను సంప్రదించినా వారు క్యారెక్టర్ నలుపు కావడంతో రిజెక్ట్ చేయగా.. ఐశ్యర్య ఒకే అని చెప్పినట్లు తెలుస్తోంది.

కృష్ణ తులసి సీరియల్ లో శ్యామగా డీ గ్లామర్ రోల్ లో నటిస్తుంది. ఇప్పటి వరకూ ప్రసారమైన ఎపిసోడ్స్ లో శ్యామగా నటించి ఐశ్యర్య మెప్పించింది అని చెప్పవచ్చు.. రోజు రోజుకీ ఈ సీరియల్ బుల్లి తెర అభిమానుల ఆదరణ సొంతం చేసుకుంటుంది. అంతేకాదు.. నలుపు కాన్సెప్ట్ తో ఇప్పటికే వంటలక్క పాత్ర ప్రేక్షకులకు దగ్గరయింది. ఈ నేపథ్యంలో మళ్ళీ కృష్ణ తులసి లో శ్యామా గా మరో హీరోయిన్ నలుపు రంగు తో వచ్చింది. దీంతో కృష్ణ తులసి సీరియల్ ఎఫెక్ట్ కార్తీక దీపం పై పడుతుందా అనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు వంటలక్క కు పోటీగా పాటలక్క అంటూ సరదాగా ప్రేక్షకులు కార్తీకదీపం సీరియల్ ను కృష్ణ తులసి సీరియల్ ను కంపేర్ చేస్తూ.. కామెంట్ చేస్తున్నారు.

Also Read:

 తెలుగురాష్ట్రాల గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్

జొమాటో మహిళను శిక్షించండి.. డెలివరీ బాయ్‌కి మద్దతు తెలిపిన బాలీవుడ్ సూపర్ బ్యూటీ..