స్టార్ హీరో కావాల్సిన రాజేష్.. 38 ఏళ్లకే చనిపోవడానికి కారణం ఇదే.. కూతురు ఇప్పుడు పెద్ద హీరోయిన్..

ఒకప్పుడు తెలుగులో సెన్సేషన్ హీరో. వరుస అవకాశాలు, హిట్స్ అందుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో స్టార్ హీరో అయిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా కేవలం 38 ఏళ్ల వయసులోనే మరణించారు. హీరో రాజేశ్ కూతురు ఇప్పుడు తెలుగులో తోపు హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరు.. అసలు రాజేశ్ చనిపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందామా.

స్టార్ హీరో కావాల్సిన రాజేష్.. 38 ఏళ్లకే చనిపోవడానికి కారణం ఇదే.. కూతురు ఇప్పుడు పెద్ద హీరోయిన్..
Rajesh

Updated on: Sep 23, 2026 | 7:37 AM

టాలీవుడ్ ఇండస్ట్రీలో1980ల కాలంలో తన విలక్షణ నటనతో, చార్మింగ్ లుక్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజేశ్. సీనియర్ నటుడు ఆనంద్ మోహన్ కుమారుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన సోదరి శ్రీలక్ష్మీ తెలుగు చిత్ర పరిశ్రమలో పాపులర్ హాస్యనటి. 1980వ దశకంలో సోలో హీరోగా, అలాగే సెకండ్ హీరోగా అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. అప్పట్లోనే హ్యాండ్సమ్ హీరోగా పాపులర్ అయ్యాడు. సుమారు 50కి పైగా తెలుగు సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించారు. అలసిపోని వసంతం, నవమోహిని, రెండు జెడ్ల సీత, కలియుగ పాండవులు, మయూరి వంటి చిత్రాలు అతడికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే స్టార్ హీరో కావాల్సిన రాజేశ్ కేవలం 38 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. కెరీర్ మంచి ఊపులో ఉన్న సమయంలోనే రాజేశ్ అనారోగ్య కారణాలు, ఇతర వ్యక్తిగత సమస్యల వల్ల 1990ల చివర్లోనే చిన్న వయసులోనే కన్నుమూశారు. తక్కువ కాలమే నటుడిగా రాణించినప్పటికీ, తన అమాయకపు రూపం , నటనతో తెలుగు ప్రేక్షకులలో చెరగని ముద్ర వేశారు.

ఇటీవల నటి శ్రీలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తన తమ్ముడి మరణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజేష్ నటించిన ప్రతి సినిమా విజయవంతం కావడంతో ఆయనకు మంచి మార్కెట్, గుర్తింపు లభించాయని, చిన్న వయసులోనే గొప్ప మెచ్యూరిటీ చూపించేవాడని, ఆ రోజుల్లో ప్రేమకథా చిత్రాలు హిట్ కావడంతో రాజేష్‌ ఎక్కువగా అలాంటి చిత్రాలు చేసి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారని తెలిపారు. రాజేష్‌ మరణం “అత్తారిల్లు” సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిందని ప్రచారంలో ఉన్నప్పటికీ, ఈ విషయంపై శ్రీలక్ష్మి స్పష్టతనిచ్చారు. ఆ సినిమాలో తాను లేనని, రాజేష్‌ ఉన్నాడని, అయితే ఆ సినిమా విడుదలైనప్పటికీ పెద్దగా ఆడలేదని ఆమె పేర్కొన్నారు. రాజేష్ మరణించినప్పుడు తాను చెన్నైలో షూటింగ్‌లో ఉన్నానని, వెంటనే హైదరాబాద్‌కు చేరుకున్నానని తెలిపారు. రాజేష్ ఎప్పుడూ తన కళ్ళ సమస్యల గురించి తమ వద్ద ఫిర్యాదు చేయలేదని, ఈ ప్రచారం ఎలా మొదలైందో తమకు తెలియదని స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం దక్షిణాదిలో పెద్ద హీరోయిన్. తమిళం, తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. తెలుగులో సంక్రాంతికి వస్తున్నాం మూవీతో భారీ విజయాన్ని అందుకుంది. రాజేష్ మరణించే సమయానికి ఐశ్వర్య రాజేశ్ ఇంకా చిన్న పిల్లగానే ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

ఎక్కువ మంది చదివినవి : Udaya Bhanu: పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన.. చివరకు అలాంటి పరిస్థితుల్లో.. ఉదయభాను ఎమోషనల్..

Loading...
Unable to load recommendations.
Follow Us