
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా కింగ్‌డమ్. ఈ మూవీ రిలీజ్ డేట్ కోసం రౌడీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాను జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి రిలీజ్ డేట్ ప్రోమోను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో ఈ సినిమా పలు సార్లు వాయిదాలు పడి అభిమానులను నిరాశపరిచినా.. అవన్నీ మర్చిపోయేలా ఉంటుందని సమాచారం. రిలీజ్ డేట్ ప్రోమోలో.. ఏదైనా చేస్తా సార్.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అంటూ విజయ్ దేవరకొండ డైలాగ్‌లో ప్రోమో అదిరిపోయింది.