అభిమానులకు దొరికిపోయిన బాలీవుడ్ రహస్య ప్రేమికులు.. ఎలాగో దొరికిపోయాం కదా అని ఏం చేశారంటే?

|

Dec 31, 2020 | 1:03 PM

kiara advani and sidharth malhotra: 'భరత్ అనే నేను' సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు సరసన నటించిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ

అభిమానులకు దొరికిపోయిన బాలీవుడ్ రహస్య ప్రేమికులు.. ఎలాగో దొరికిపోయాం కదా అని ఏం చేశారంటే?
Follow us on

kiara advani and sidharth malhotra: ‘భరత్ అనే నేను’ సినిమాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు సరసన నటించిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ అందరికి గుర్తుండే ఉంటుంది. కొంతకాలంగా ఈ అమ్మడు హ్యాండ్సమ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో రిలేషన్‌షిప్‌లో ఉందని ఎప్పటి నుంచో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఈ విషయాన్ని వీరిద్దరు ఎప్పుడు నిర్ధారించలేదు.

అయితే నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనడానికి వీరిద్దరు మాల్దీవులకు వెళుతుండగా ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డారు. దీంతో వీరి ఎవ్వారం అందరికి తెలిసిపోయింది. ఎలాగో బయటి ప్రపంచానికి తెలిసిందని అనుకున్నారేమో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో వీరిద్దరికి సంబంధించి ఒక్క ఫోటో కూడా లీక్ చేయని వీరు ఉన్నట్టుండి ఇలా కలిసి ఉన్న ఫొటోలను రిలీజ్ చేస్తున్నారంటే ఏదో ఒక విషయాన్ని చెప్పకనే చెబుతున్నారు. బహుశా కొత్త సంవత్సరం నుంచి రిలేషన్‌ షిప్ మెయింటన్ చేస్తారేమో అని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.