KGF Chapter 2: అరివీర భయంకర ‘అధీర’ వచ్చేస్తున్నాడు

| Edited By:

Jul 27, 2020 | 1:20 PM

ఇటీవల కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా 'కేజీఎఫ్ 2' అప్‌డేట్ త్వరలోనే ఉంటుందని దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

KGF Chapter 2: అరివీర భయంకర అధీర వచ్చేస్తున్నాడు
Follow us on

KGF Chapter 2: ఇటీవల కైకాల సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ‘కేజీఎఫ్ 2’ అప్‌డేట్ త్వరలోనే ఉంటుందని దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ అప్‌డేట్‌ను తాజాగా చెప్పేశారు. ఈ నెల 29న అరివీర భయంకర అధీర లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు టీమ్ ప్రకటించింది. ఇందులో అధీర పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటించగా.. అతడి పుట్టినరోజు సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు లుక్ విడుదల కానుంది.

కాగా ఈ ఏడాదే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మొదట ప్లాన్ చేశారు. కానీ కరోనా రావడంతో ఈ మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటికే షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యిందని.. పరిస్థితులు సర్ధుకుంటే చెప్పిన తేదీకే(అక్టోబర్ 23) ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని దర్శకుడు ఆ మధ్యన చెప్పుకొచ్చారు. ఇక వచ్చే నెలలో థియేటర్లు తెరిచే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. అక్టోబర్‌లోనే కేజీఎఫ్‌ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే యశ్ నటించిన ఈ చిత్రంపై అన్న భాషల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read This Story Also: ‘ఆస్కార్’ రావడం శాపమైంది.. బాలీవుడ్‌ ఆఫర్లను ఇవ్వలేదు