‘ఆస్కార్’ రావడం శాపమైంది.. బాలీవుడ్‌ ఆఫర్లను ఇవ్వలేదు

బాలీవుడ్‌లోని ఓ గ్యాంగ్‌ను తనను సైడ్ చేస్తుందని, తనపై అసత్య ప్రచారాలు చేస్తూ అవకాశాలు రాకుండా చేస్తుందని సంగీత దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే

'ఆస్కార్' రావడం శాపమైంది.. బాలీవుడ్‌ ఆఫర్లను ఇవ్వలేదు
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2020 | 1:18 PM

Resul Pookutty  on Bollywood: బాలీవుడ్‌లోని ఓ గ్యాంగ్‌ను తనను సైడ్ చేస్తుందని, తనపై అసత్య ప్రచారాలు చేస్తూ అవకాశాలు రాకుండా చేస్తుందని సంగీత దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మరికొందరు ప్రముఖులు బాలీవుడ్‌లో తమకు ఎదురైన పరిస్థితులపై గళం విప్పుతున్నారు. తమకు అవకాశాలు రాకుండా చేశారని, చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని బాలీవుడ్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మరో ఆస్కార్ అవార్డు గ్రహీత, సౌండ్ ఇంజనీర్ అండ్ ఎడిటర్ రెసూల్‌‌ పోకుట్టి సోషల్ మీడియాలో స్పందించారు.

స్లమ్‌డాగ్‌ మిలియనీర్ సినిమాకు గానూ ఆస్కార్‌ను అందుకున్న రెసూల్‌‌‌.. అకాడమీ అవార్డు వచ్చిన తరువాత బాలీవుడ్‌లో తనకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదని అన్నారు. ఈ మేరకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్‌ను ట్యాగ్ చేస్తూ రెసూల్ కొన్ని ట్వీట్లు చేశారు.

”శేఖర్ కపూర్‌ నన్ను కూడా అడగండి. నేను చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా. ఆస్కార్ గెలిచిన తరువాత హిందీ భాషలో నాకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వలేదు. కానీ ప్రాంతీయ భాషల వారు నన్ను వదులుకోకుండా పట్టుకున్నారు. అప్పట్లో చాలా నిర్మాణ సంస్థలు నువ్వు మాకు అవసరం లేదంటూ నా మొహం మీదనే చెప్పేశాయి.

కలలు కనాలని నాకు శేఖర్‌ కపూర్‌ నేర్పించారు. నన్ను నమ్మే వాళ్లు చాలా మంది ఉన్నారు. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను సులభంగానే హాలీవుడ్‌కి వెళ్లేవాడిని. కానీ అలా చేయలేదు. ఎందుకంటే భారతీయ సినిమానే నాకు ఆస్కార్ వచ్చేలా చేసింది. అంతేకాదు నేను ఆరు సార్లు మోషన్ పిక్చర్ సౌండ్ ఎడిటర్స్‌కి నామినేట్‌ అయ్యి గెలిచాను. అవన్నీ ఇక్కడ పనిచేసినందుకు నేను గెలుచుకున్నవే. ఎక్కడైనా మనలను పడేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కానీ నేను నమ్మిన వారిపై నాకు చాలా నమ్మకం ఉంది. ఈ విషయాన్ని నా అకాడమీ మెంబర్లు, స్నేహితులతో కూడా పంచుకున్నా. అప్పుడు వారు ఆస్కార్ రావడం వలన శాపం అని అన్నారు. ఇది ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు. నిన్ను కొందరు వ్యతిరేకిస్తున్నారు అంటే నీ స్థానం పెరిగినట్లు” అని రాసుకొచ్చారు.

Read This Story Also: ‘బిగ్‌బాస్‌’ని బ్యాన్‌ చేయాలన్న ‘మాజీ కంటెస్టెంట్‌’