Katrina Kaif: మెహెందీ ఫంక్షన్‌ కోసం రాజస్థాన్‌ హెన్నాను ఆర్డర్‌ చేసిన కత్రినా.. ఎంత ఖర్చు అవుతుందంటే..

|

Nov 25, 2021 | 9:04 PM

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ మొదటివారంలో రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది

Katrina Kaif: మెహెందీ ఫంక్షన్‌ కోసం రాజస్థాన్‌ హెన్నాను ఆర్డర్‌ చేసిన కత్రినా..  ఎంత ఖర్చు అవుతుందంటే..
Follow us on

బాలీవుడ్‌ ప్రేమ పక్షులు కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో పెళ్లి చేసుకోనున్నారని గుసగుసలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ మొదటివారంలో రాజస్థాన్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. కాగా దర్శకుడు కబీర్‌ఖాన్‌ ఇంట్లో ఇటీవలే కత్రినా- విక్కీల నిశ్చితార్థం జరగడం, వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం తెలిసిందే. అయితే తమ రిలేషన్‌షిప్‌ విషయంలో మొదటి నుంచి గోప్యత పాటిస్తున్న ఈ ప్రేమ పక్షుల పెళ్లి గురించి రోజుకో కొత్త హల్‌చట్‌ చేస్తోంది. తాజాగా వీరు ముంబైలో కోర్టు మ్యారేజ్ చేసుకోనున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. అయితే ఇప్పటివరకు తమ పెళ్లిపై కత్రినా- విక్కీలు కానీ వారి కుటుంబాలు స్పందించిన దాఖలాలు లేవు. మరోవైపు వీరి పెళ్లి పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయని తెలుస్తోంది.

అందుకే అంత ఖర్చు..
కాగా కత్రినా కైఫ్ పెళ్లికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించే మెహందీ ఫంక్షన్‌లో పెట్టుకునే హెన్నా కోసం ఆమె భారీగానే ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. జోధ్‌పూర్ లోని పాలి జిల్లాలో ప్రత్యేకంగా తయారుచేసే ఈ హెన్నాను సోజత్‌ మెహెందీ అంటారట. దీనికి సంబంధించి మెహందీ నమూనాలు కూడా కత్రినాకు చేరాయని వారి కుటుంబీకులు చెబుతున్నారు. ఇది సహజ సిద్ధంగా తయారవుతుందని, ఎటువంటి రసాయనాలు మిక్స్‌ చేయరని అందుకే దీని తయారీకి రూ. 50వేల నుంచి రూ.1 లక్ష ఖర్చు అవుతుందట. అయితే హెన్నాను తయారుచేసే వ్యక్తి సెలబ్రిటీ కపుల్స్‌ నుంచి ఒక్క పైసా కూడా తీసుకోడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Also Read:

ఇన్నేళ్ల తర్వాత చిరంజీవి సరసన రమ్యకృష్ణ !! వీడియో

సత్యదేవ్ నయా మూవీ “స్కైల్యాబ్” నుంచి లిరికల్ సాంగ్.. ఆకట్టుకుంటున్న ‘రారా లింగా’.. పాట..

Anubhavinchu Raja: ఈ టైంలో సినిమా చేయడం అవసరమా అనిపించింది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రియ..