‘భారతీయుడు 2’ కోసం ఆ ఇద్దరు..?

| Edited By: Pardhasaradhi Peri

Jul 21, 2019 | 9:47 AM

కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమై.. కొద్దిరోజుల తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తరువాత షూటింగ్ ను మళ్లీ ప్రారంభించాలనుకున్నప్పటికీ.. బడ్జెట్ విషయంలో దర్శకుడికి, నిర్మాతలకు మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే తాజాగా అవన్నీ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఆగష్టు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో లీడ్ హీరోయిన్‌గా నటిస్తున్న […]

భారతీయుడు 2 కోసం ఆ ఇద్దరు..?
Follow us on

కమల్ హాసన్ హీరోగా దర్శకుడు శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమై.. కొద్దిరోజుల తర్వాత కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తరువాత షూటింగ్ ను మళ్లీ ప్రారంభించాలనుకున్నప్పటికీ.. బడ్జెట్ విషయంలో దర్శకుడికి, నిర్మాతలకు మధ్య విభేదాలు తలెత్తాయి. అయితే తాజాగా అవన్నీ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఆగష్టు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో లీడ్ హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్ అగర్వాల్‌తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటించబోతున్నారట. ఐశ్వ‌ర్య రాజేశ్‌, ప్రియా భ‌వానిలను కీలక పాత్రల కోసం ఎంపిక చేశారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2020న విడుదల కానుంది.