Kavya Maran-Anirudh: కావ్య మారన్ అనిరుధ్ వివాహం.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానించిన కళానిధి మారన్..

సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని గౌరవప్రదంగా కలిశారు ప్రముఖ నిర్మాద కళానిధి మారన్. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ విందు నవంబర్ 21న చెన్నైలో జరుగుతుందని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Kavya Maran-Anirudh: కావ్య మారన్ అనిరుధ్ వివాహం.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానించిన కళానిధి మారన్..
Kalanidhi Maran, Cm Revanth

Updated on: Oct 17, 2026 | 9:22 AM

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్, సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్ వివాహం నిశ్చయమైన సంగతి తెలిసిందే. చెన్నైలో నవంబర్ 21న వీరిద్దరి వివాహం జరగనుంది. ఈ క్రమంలో తమిళ చిత్రపరిశ్రమతోపాటు భారతీయ చిత్రపరిశ్రమలోని ప్రముఖులను, రాజకీయ నాయకులకు ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు కళానిధి మారన్. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులను ఆహ్వానించారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి దంపతులను కళానిధి మారన్ తన సతీమణి కావేరి మారన్ కలిసి తమ కుమార్తె వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ అధికారిక ప్రకటించింది. అలాగే ఇందుకు సంబంధించిన ఫోటోస్ సైతం పోస్ట్ చేసింది.

ఇదిలా ఉంటే.. కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ జంట పెళ్లి వార్త మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అయితే, అనిరుధ్ , కావ్య మారన్ కుటుంబాలు పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాలను విడిగా అధికారికంగా ప్రకటించాయనే సమాచారం ఏదీ లేదు. కావ్య, అనిరుధ్ ఇరువురు 2025 నుంచి ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే తమ కూతురి గురించి వినిపిస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని గతంలో ఇరు కుటుంబాలు వెల్లడించాయి. అయితే అనిరుధ్ బంధువు నటుడు వై.జి. మహేంద్రన్ గత జూన్ లో ఒక ఇంటర్వ్యూలో అనిరుధ్ వివాహ విషయాన్ని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఆ జంట గ్రీస్‌లో వివాహం చేసుకోవచ్చని, ఆ పెళ్లి నవంబర్ 11న జరిగే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే, పెళ్లి తేదీ, వేదికకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

నివేదికల ప్రకారం, డాక్టర్ మారన్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్‌తో పాటు ఇతర ప్రముఖులకు కూడా వివాహ ఆహ్వానాలు పంపనున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో జరగనున్న ఈ విందుకు సినీ పరిశ్రమ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Trending Song: యూట్యూబ్ షేక్ చేస్తున్న బతుకమ్మ సాంగ్.. రెండు రోజుల్లోనే 7 లక్షల వ్యూస్.. డీజేలలో మారుమోగిపోతుంది..

తెలంగాణ సీఎంఓ..

ఎక్కువ మంది చదివినవి :  Cinema : ఇదేం సినిమా రా నాయనా.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చి దుమ్ములేపుతున్న మూవీ.. ట్రెండింగ్ నంబర్ 1గా రచ్చ రచ్చ..

Loading...
Unable to load recommendations.
Follow Us