
మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చే సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఇస్తుంటారు. ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా కేవలం బలమైన కథ, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో జనాలను ఊపిరి బిగబట్టి చూసే సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో ‘ఇరట్టా’ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ప్రముఖ నటుడు జోజు జార్జ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సైకలాజికల్ పోలీస్ థ్రిల్లర్ మూవీ, ఓటీటీలో విడుదలైన తర్వాత దేశవ్యాప్తంగా సినీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది. రోహిత్ ఎంజీ కృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వినోద్, ప్రమోద్ అనే ఇద్దరు కవలల చుట్టూ కథ నడుస్తుంది. వినోద్ ఒక పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తుండగా, అతని కవల సోదరుడు ప్రమోద్ డీవైఎస్‌పీగా బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అయితే ఒకరోజు వాగమండ్ పోలీస్ స్టేషన్‌లో ఎవరికీ అంతుచిక్కని రీతిలో వినోద్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవుతాడు. పోలీస్ స్టేషన్ లోపలే జరిగిన ఈ హత్య ఎవరు చేశారు? దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమవుతుంది. మృతుడి సోదరుడైన ప్రమోద్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు చేపట్టినప్పుడు అనేక షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తాయి.
ఎక్కువ మంది చదివినవి : Gulabi Movie: ఒక్క పాటతో స్టార్ డమ్.. గులాబీ సినిమాను మిస్సైన హీరోయిన్.. ఎవరంటే..
ఈ చిత్రంలో జోజు జార్జ్ తన అద్భుతమైన నటనతో ఇద్దరు అన్నదమ్ముల పాత్రల్లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఒకరిపై ఒకరికి ఉన్న ఈగో, చిన్ననాటి చేదు జ్ఞాపకాలు, కుటుంబ నేపథ్యాన్ని దర్శకుడు అత్యంత సహజంగా తెరకెక్కించారు. సినిమా సెకండ్ పార్ట్ అంతా ఒక సాధారణ ఇన్వెస్టిగేషన్ డ్రామా లాగా అనిపించినప్పటికీ, చివరి 10 నిమిషాల్లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులకు మైండ్ బ్లాంక్ చేసేలా ఉంటుంది. ఊహించని మలుపులతో ముగిసే ఈ ముగింపు ప్రేక్షకులను తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రతి ఒక్కరూ కచ్చితంగా చూడాల్సిన అద్భుతమైన చిత్రాలలో ఇది ఒకటి.
ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..
ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా సక్సెస్‌ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సబ్‌టైటిల్స్‌తో ఈ థ్రిల్లర్ మూవీ అందుబాటులో ఉంది. సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ డ్రామాలు, వైవిధ్యమైన థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో అంజలి సైతం కీలకపాత్రలు పోషించారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నన్ను అహాంకారి అనుకున్నారు.. 1500 సినిమాలు చేసినా ఏమీ మిగల్లేదు.. సీనియర్ నటుడు..
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. 20 ఏళ్లుగా తగ్గని స్టార్ డమ్..