
దేవర, పెద్ది చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. అటు సినిమాలతోపాటు ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తాజాగా చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. తన జీవితంలోని అత్యంత కష్టతరమైన దశలలో తన స్నేహితుడు శికర్ పహారియా తనకు అండగా ఉన్నాడని చెప్పుకొచ్చింది. 2018లో తన తల్లి శ్రీదేవి మరణించిన తర్వాత కాలాన్ని గుర్తుచేసుకుంటూ, తనకు తోడుగా ఉండేందుకు శిఖర్ లండన్‌లో తన చదువును వదిలేశాడని వెల్లడించింది. 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తు శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటికీ శ్రీదేవి మరణం ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
ఇదిలా ఉంటే.. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న జాన్వీ కపూర్ తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషళ్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆ కష్ట సమయంలో శిఖర్ తనకు ఎలా అండగా ఉన్నాడో గుర్తు చేసుకున్నారు. కానీ అప్పటికీ ఇంతా తాము ఎలాంటి రిలేషన్ షిప్ లో లేమని తెలిపింది. జాన్వీ మాట్లాడుతూ.. “అతను లండన్‌లో చదువుకుంటున్నాడు. అమ్మ చనిపోయారని తెలియగానే అతడు అర సెమిస్టర్ సెలవు తీసుకుని వచ్చాడు. నిజానికి అతడు తన తండ్రితో పట్టణంలో ఉంటున్నాడని అనుకున్నాడు. కానీ అతడు ముంబైలోని జుహులోని తన స్నేహితుడు ఇంటికి షిఫ్ట్ అయ్యి దాదాపు నెల రోజులు ఉన్నాడు. ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది” అంటూ చెప్పుకొచ్చాడు.
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
కొన్నాళ్లుగా జాన్వీ, శిఖర్ పహారియా ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని వీరిద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. అలాగే తమ గురించి వస్తున్న రూమర్స్ ను ఖండించలేదు. ఇటీవల రాజ్ షమానీ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. “ప్రేమ అనేది ఎంతో సురక్షితమైన భావ. నాలో ఉన్న నిస్హాయతను దూరం చేసింది శిఖర్ ప్రేమే. అతడి దగ్గర నేను ఓ చిన్న పిల్లలా ప్రవర్తించగలను. నన్ను ఎవరు జడ్జ్ చేయరనే స్వేచ్చ నాకు అక్కడే ఉంటుంది” అని చెప్పుకొచ్చింది.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..