
విభజన కోసం దశాబ్దాల ఉద్యమాల తర్వాత అనివార్య కారణాలతో 2014లో తెలుగు నేల రెండుగా చీలిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడివిడి రాష్ట్రాలుగా విడిపోయి, ఎవరి పాలన వాళ్లు చేసుకోవాలంటూ స్పష్టమైన విధివిధానాలతో విభజన చట్టాలు రాసుకున్నారు. ఊర్లు పంచుకున్నారు., ఆస్తులు పంచుకున్నారు, అప్పులు పంచుకున్నారు, బడ్జెట్లు కూడా రెండు అయ్యాయి. కానీ, చీలికకు నోచుకోని రంగం ఏదైనా ఉంది అంటే అది సినిమా ఇండస్ట్రీ ఒక్కటే. మనం మనం తెలుగువాళ్లం కనుక, తెలుగు సినిమా ఏకతాటిపైనే నిలబడింది. కానీ, అది అదృష్టమో లేక దురదృష్టమో ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. రెండు రాష్ట్రాల మధ్య ఏదోఒక సందర్భంలో సీజనుకోసారైనా చర్చ షురూ అవుతోంది. సినిమా పరిశ్రమపై ఏ రాష్ట్రానికి ఎక్కువ ప్రేమ, ఏ రాష్ట్రం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందనే పంచాయితీ.. ఇదిగో ఇప్పుడు మళ్లీ మొదలైంది. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన గద్దర్ అవార్డుల కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నప్పుడు మెగాస్టార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ సంచలనం సృష్టించింద. సినీ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూనే, ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేపట్టినా సహకరించడానికి సినీ రంగం ఎప్పుడూ సిద్దం ఉంటుందని చెబుతూ, ఏపీ...