Prabhas Birthday: డార్లింగ్ సినిమాలు రీ రిలీజ్‎ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే.. పుట్టిరోజు వేడుకలకు సర్వం సిద్ధం..

|

Oct 19, 2024 | 3:57 PM

ప్రభాస్.. ఈ పేరు వింటే చాలు పాన్ ఇండియా సినిమా పులకరించిపోతుంది. అలాంటి డార్లింగ్ పుట్టినరోజు అంటే ఓ రేంజ్ ఉంటుంది అన్నట్లుగా వేడుకలు జరగనున్నాయి. ఇండియా నుంచి జపాన్ వరకు ప్రభాస్ సినిమా రీ రిలీజ్‎లు సందడి చేయనున్నాయి. అక్టోబర్ 23న రెబెల్ స్టార్ పుట్టిరోజు సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా మొత్తం 7 సినిమాలు రీ రిలీజ్‎కు సిద్ధంగా ఉన్నాయి. ఏంటా సినిమాలు.? ఏది ఎక్కడ.?

1 / 5
ముందుగా తెలుగు రాష్ట్రాల్లో డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా మూడు సినిమాలు రీ రిలీజ్‎కు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మొదటిది ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ అక్టోబర్ 22న మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాతోనే శ్రీదేవి కథానాయకిగా కెరీర్ మొదలుపెట్టుంది.

2 / 5
ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సి పన్ను జంటగా తెరకెక్కిన మిస్టర్ పర్‌ఫెక్ట్ కూడా మరోసారి అక్టోబర్ 22న విడుదల కానుంది. అలాగే గత ఏడాది డిసెంబర్ బ్లాక్ బస్టర్ సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ కూడా మరోసరి సందడి చేయనుంది.

3 / 5
కర్ణాటకలో రెండు సినిమాలు రీ రిలీజ్‎కు రెడీ అయ్యాయి. వాటిలో ఒకటి రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ఛత్రపతి. మరొకటి ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇక్కడ మరోసారి సందడి చేయనున్నాయి.

4 / 5
 గుజరాత్‎లో కూడా ప్రభాస్ పుట్టిరాజు పురస్కరించుకొని ఓ బ్లాక్ బస్టర్ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. అదే కొరటాల శివ దర్శకుడిగా డెబ్యూ ఇచ్చిన మిర్చి. ఇందులో అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్స్. సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. 

5 / 5
ఇండియాలోనే కాదు.. జపాన్‎లో కూడా పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు హావ నడుస్తుంది. ఇక్కడ కూడా రెండు సినిమాలు రీ రిలీజ్‎ కానున్నాయి. వాటిలో ఒకటి యాక్షన్ ఎంటర్టైనర్ సాహూ, మరొకటి రొమాంటిక్ మూవీ రాధేశ్యామ్.