Priyanka Nick Jonas: షూటింగ్‏లో గాయపడ్డ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్.. ఆసుపత్రిలో చేర్చిన సిబ్బంది..

Priyanka Chopra Nick Jonas: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ఓ షూటింగ్ ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో అతడిని

Priyanka Nick Jonas: షూటింగ్‏లో గాయపడ్డ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్.. ఆసుపత్రిలో చేర్చిన సిబ్బంది..
Priyanka

Updated on: May 17, 2021 | 6:08 PM

Priyanka Chopra Nick Jonas: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త.. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్ ఓ షూటింగ్ ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో అతడిని వెంటనే అంబులెన్స్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. లాస్ ఏంజెల్స్ లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్’ షూటింగ్ చేస్తున్న సమయంలో నిక్ స్వల్పంగా గాయపడ్డారు. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లుగా సమాచారం. నిక్ కు తగిలిన గాయాలు పెద్దవేమి కాకపోవడంతో డాక్టర్లు చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్ చేసినట్లుగా అక్కడి మీడియా తెలిపింది. నిక్ తిరిగి సోమవారం తన రియాలిటీ షో ‘ది వాయిస్’ లో పాల్గోనబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే అతనికి గాయాలు ఎలా అయ్యాయనే విషయం తెలియరాలేదు.

ఇదిలా ఉంటే.. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో భారత్ కు సహాయం చేయడం కోసం ప్రియాంక, నిక్ జోనాస్ ఇటీవల విరాళాలు సేకరించారు. కరోనా బారిన పడి ప్రస్తుతం ఆక్సిజన్, టీకా ఉవసరం ఉన్నవారికి నిధుల సేకరణ కోసం వారిద్దరూ స్వచ్చంద సంస్థను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకూ వీరు 1 మిలియన్ డబ్బు సేకరించారు. అలాగే విరాళాలు అందచేసిన వారికి ఇటీవల ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ కృతజ్ఞతలు తెలుపుతు ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. 2018లో ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ప్రియాంక కంటే నిక్ పదేళ్లు చిన్నవాడు. ఇక నిక్ జోనాస్ ఇటీవల తన స్టూడియో ఆల్పమ్ స్పే్స్ మాన్ ను విడుదల చేశాడు. అలాగే జుమాన్జీ, వెల్ కమ్ టు ది జంగిల్, మిడ్ వే, ఖోస్ వాకింగ్ సినిమాల్లోనూ నటించారు.

Also Read: పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..

PF ఖాతాదారులకు శుభవార్త.. ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం.. ఇక నుంచి ప్రతి నెల అకౌంట్‏లోకి డబ్బులు..