హీరో రవితేజ కొత్త అవతారం..!

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:33 PM

మాస్ సినిమాలకు పెట్టింది పేరు మాస్ రాజా రవితేజ. గత కొద్దికాలంగా మాస్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు రవితేజ. అయితే ప్రస్తుతం ‘డిస్కో రాజా’, ‘తేరి’ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే మెగా ఫోన్ పట్టుకోనున్నాడట. మరోవైపు రవితేజ పూర్వం దర్శకత్వ శాఖలో పని చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు  కొన్ని ఇంటర్వూస్ లో దర్శకత్వం వహించాలని ఆలోచన ఉందని ఆయన మనసులోని మాట కూడా తెలియజేశాడు. తాజా సమాచారం […]

హీరో రవితేజ కొత్త అవతారం..!
Follow us on

మాస్ సినిమాలకు పెట్టింది పేరు మాస్ రాజా రవితేజ. గత కొద్దికాలంగా మాస్ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు రవితేజ. అయితే ప్రస్తుతం ‘డిస్కో రాజా’, ‘తేరి’ రీమేక్ సినిమాలతో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే మెగా ఫోన్ పట్టుకోనున్నాడట.

మరోవైపు రవితేజ పూర్వం దర్శకత్వ శాఖలో పని చేసి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు  కొన్ని ఇంటర్వూస్ లో దర్శకత్వం వహించాలని ఆలోచన ఉందని ఆయన మనసులోని మాట కూడా తెలియజేశాడు. తాజా సమాచారం ప్రకారం ఆయన త్వరలోనే ఒక సినిమాకు దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే నందమూరి కళ్యాణ్ రామ్ కు ఒక కథ వినిపించాడట.. దానికి కళ్యాణ్ రామ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. ఇక ఈ సినిమాను కళ్యాణ్ రామ్ తన సొంత బ్యానర్ నందమూరి ఆర్ట్స్ బ్యానర్ మీద నిర్మించనున్నాడట. దీనిలో హీరో పాత్ర కోసం ఒక యంగ్ హీరోతో సంప్రదింపులు జరుగుతున్నట్లు వినికిడి. చూడాలి రవితేజ దర్శకుడిగా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో..?