ఫైనల్‌గా ఆ హీరోను ఓకే చేసుకున్న త్రివిక్రమ్‌..!

ఈ ఏడాది ప్రారంభంలో అల వైకుంఠపురములోతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు.

ఫైనల్‌గా ఆ హీరోను ఓకే చేసుకున్న త్రివిక్రమ్‌..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 26, 2020 | 5:15 PM

Trivikram Next movie: ఈ ఏడాది ప్రారంభంలో అల వైకుంఠపురములోతో పెద్ద విజయాన్ని ఖాతాలో వేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఎన్టీఆర్‌తో మూవీని ప్రకటించినప్పటికీ.. ఆ హీరో ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తున్నందున ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లేసరికి ఇంకా చాలా సమయమే పట్టనుంది. ఇక ఈ మధ్యన త్రివిక్రమ్‌తో మూవీ ఉండబోతున్నట్లు మహేష్‌ బాబు ఓ హింట్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం మహేష్‌ సర్కారు వారి పాటలో నటించేందుకు సిద్ధమవుతున్నందున ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పట్లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు లేవు. ఈ క్రమంలో త్రివిక్రమ్ మరో హీరోను ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎనర్జిటిక్ హీరో రామ్‌కు ఇటీవల త్రివిక్రమ్ ఒక కథను చెప్పగా.. అది ఆ నటుడికి బాగా నచ్చిందట. దీంతో వెంటనే ఓకే చెప్పారట. లాక్‌డౌన్‌ కంటే ముందే రెడ్‌ మూవీని పూర్తి చేసుకున్న రామ్.. ఇంతవరకు మరో దర్శకుడికి ఓకే చెప్పలేదు. ఇక తాజాగా త్రివిక్రమ్‌కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మరో కొత్త కాంబోను టాలీవుడ్‌ ప్రేక్షకులకు చూసే అవకాశం వస్తుంది.

Read More:

ఒక ఇంటివాడైన ‘రెమో’ దర్శకుడు

కొత్త జాతీయ రహదారి: హైదరాబాద్- తిరుపతి మధ్య తగ్గనున్న 80కి.మీ దూరం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu