Manya: సీతరామ రాజు సినిమాలో తళుక్కుమన్న ఈ హీరోయిన్‌ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తోందో తెలుసా.?

|

Jan 27, 2023 | 12:43 PM

మాన్య.. ఈ పేరు చెబితే పెద్దగా ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ నాగార్జున హీరోగా తెరకెక్కిన సీతారామరాజు సినిమాలో సుమ అనే పాత్ర ప్రతీ ఒక్కరికీ పరిచయమే. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచచయమైన మాన్య తెలుగు వారికి ఆకట్టుకున్నారు. 1989లో మలయాళ..

Manya: సీతరామ రాజు సినిమాలో తళుక్కుమన్న ఈ హీరోయిన్‌ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఏం చేస్తోందో తెలుసా.?
Actress Manya
Follow us on

మాన్య.. ఈ పేరు చెబితే పెద్దగా ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు కానీ నాగార్జున హీరోగా తెరకెక్కిన సీతారామరాజు సినిమాలో సుమ అనే పాత్ర ప్రతీ ఒక్కరికీ పరిచయమే. ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచచయమైన మాన్య తెలుగు వారికి ఆకట్టుకున్నారు. 1989లో మలయాళ చిత్ర ఇండస్ట్రీ ద్వారా బాల్య నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మాన్య. ఆ తర్వాత సీతరామరాజుతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకుంది. ఒక్క ఏడాదిలోనే తెలుగులో ఏకంగా 7 సినిమాల్లో నటించింది.

ఆ తర్వాత తెలుగుతో పాటు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే 2010 తర్వాత ఇండస్ట్రీకి ఒక్కసారిగా దూరమైంది. 2010లో వచ్చిన మలయాళ చిత్రమే మాన్య నటించిన చివరి సినిమా. అయితే ఆ తర్వాత మాన్య అమెరికాకు వెళ్లింది. పై చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మాన్య.. 2013లో న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసింది. కుటుంబానికి అండగా నిలబడడానికి సినిమాల్లోకి వచ్చిన మాన్య..సుమారు 40 సినిమాల్లో నటించిన తర్వాత తన చదువును పూర్తి చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇక గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన తర్వాత మాన్య అమెరికాలోనే ఉద్యోగం చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. వివాహం చేసుకొని అమెరికాలోనే నివసిస్తోంది. మాన్యకు ఓ పాప ఉంది. ఇక మాన్య ప్రస్తుతం ఓ బడా ఐటీ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉద్యోగం చేస్తోందని సమాచారం. ఇక సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం ఫ్యాన్స్‌తో ఇప్పటికీ టచ్‌లోనే ఉంటుంది. గత కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మాన్య వార్తల్లో నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..