Director Vamsi: ఆ హీరోయిన్‏ను అలా చూపించాల్సి ఉండకూడదు.. ప్లాప్ కావడానికి కారణం అదే..  డైరెక్టర్ వంశీ..

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించి తనదైన ముద్ర వేశారు డైరెక్టర్ వంశీ. సితార, అన్వేషణ, లేడీస్ టైలర్ వంటి హిట్ చిత్రాలతో సక్సెస్ అయ్యారు. 1982లో చిరంజీవి, సుహాసిని, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రధారులుగా వచ్చిన 'మంచు పల్లకి' సినిమాతో వంశీ దర్శకుడిగా మారారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో వంశీ మాట్లాడుతూ తన సినీ ప్రయాణం గురించి వెల్లడించారు.

Director Vamsi: ఆ హీరోయిన్‏ను అలా చూపించాల్సి ఉండకూడదు.. ప్లాప్ కావడానికి కారణం అదే..  డైరెక్టర్ వంశీ..
Chettu Kinda Pleader

Updated on: Oct 01, 2026 | 1:14 PM

తెలుగు చిత్రసీమలో తనదైన మార్క్ కామెడీ, సస్పెన్స్, అద్భుతమైన పాటలతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు వంశీ. ‘లేడీస్ టైలర్’, ‘అన్వేషణ’, ‘ఏప్రిల్ 1 విడుదల’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాలను అందించిన ఆయన, ఓ ఇంటర్వ్యూలో తన గత సినిమాల గురించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో 1989లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా తెరకెక్కించిన ‘చెట్టుకింద ప్లీడర్’ సినిమా , అందులో హీరోయిన్‌గా నటించిన కిన్నెర గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ‘చెట్టుకింద ప్లీడర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించినప్పటికీ, ఆ సినిమా కాస్టింగ్ విషయంలో తాను చేసిన ఒక నిర్ణయం పట్ల వంశీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సినిమాలో కథానాయికగా నటి కిన్నెరను ఎంపిక చేసుకోవడం.. ఆమెను అలా చూపించడం తాను చేసిన పొరపాటని వంశీ పేర్కొన్నారు. ఆ పాత్రకు ఆమె సెట్ అవ్వలేదని, సినిమా అవుట్‌పుట్ పరంగా లేదా పాత్ర ప్రాధాన్యత పరంగా అనుకున్న స్థాయిలో ఆ క్యారెక్టర్ పండలేదని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

రాజేంద్ర ప్రసాద్ – వంశీ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండేవి. ‘చెట్టుకింద ప్లీడర్’ చిత్రానికి తనికెళ్ల భరణి మాటలు అందించగా, మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా అందించిన స్వరాలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. కామెడీ థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రం క్రిటిక్స్ ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల ఆదరణనూ పొందింది. అయితే, దర్శకుడిగా ఎప్పుడూ పర్‌ఫెక్షన్ కోరుకునే వంశీ మాత్రం కిన్నెర క్యారెక్టర్ విషయంలో తాను ఇంకా మెరుగైన కాస్టింగ్ ఎంచుకుని ఉండాల్సిందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా, క్రెడిట్ అంతా దక్కినా.. ఒక సృష్టికర్తగా తన లోపాలను లేదా సరిచేసుకోవాల్సిన అంశాలను ఎలాంటి దాపరికం లేకుండా ఓపెన్‌‌గా ఒప్పుకోవడం వంశీ నైజం. అందుకే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, టాలీవుడ్ సినీ వర్గాల్లోనూ వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, కిన్నెర (కృష్ణకుమారిగా), ఊర్వశి, శరత్ బాబు, గొల్లపూడి మారుతీరావు, మల్లికార్జున రావు, ప్రదీప్ శక్తి, తనికెళ్ళ భరణి, దేవదాస్ కనకాల కీలకపాత్రలు పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..

Loading...
Unable to load recommendations.
Follow Us