
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మేధస్సు, డైలాగ్ డెలివరీ, సెన్సాఫ్ హ్యూమర్ ఎప్పుడూ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆయన సినిమాలకు, అందులో వచ్చే డైలాగ్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గుంటూరు కారం సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న గురూజీ.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం మూవీతో రాబోతున్నారు. విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా వేడుకలో ఆయన చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా ఒక స్టార్ డైరెక్టర్ హోదాలో ఉన్న త్రివిక్రమ్.. అందరి ముందే ఒక యంగ్ హీరోయిన్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న తాజా కుటుంబ కథా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. అక్టోబర్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు చిత్ర యూనిట్‌తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ హాజరయ్యారు. ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో స్టేజ్ మీద ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. హీరోయిన్ శ్రీనిధి శెట్టి త్రివిక్రమ్ కూర్చున్న చోటుకి వచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన కాళ్లకు నమస్కరించబోయింది. వెంటనే త్రివిక్రమ్ సైతం ఆమెను గౌరవిస్తూ సరదాగా కాళ్లు మొక్కేందుకు కిందికి వంగడంతో అందరూ షాకయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
సడన్‌గా స్టార్ డైరెక్టర్ అలా చేసేసరికి షాకైన శ్రీనిధి శెట్టి వెంటనే తేరుకుని ఆయన్ని వారిస్తూ, వెనువెంటనే ఆయన కాళ్లకు నమస్కరించింది. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారందరూ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. “టాలీవుడ్లో ఇంత సరదాగా ఉండే దర్శకుడు త్రివిక్రమ్ ఒక్కరే” అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..