Dhruv Vikram : ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న విక్రమ్‌ తనయుడు?.. నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఫొటోలు..

|

Jan 03, 2022 | 10:46 AM

తమిళ విలక్షణ నటుడు విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యాడు . తెలుగులో విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’తో కోలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్‌

Dhruv Vikram : ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న విక్రమ్‌ తనయుడు?.. నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఫొటోలు..
Follow us on

తమిళ విలక్షణ నటుడు విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యాడు . తెలుగులో విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’తో కోలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్‌. ఇందులో  భారత సంతతికి చెందిన బ్రిటిష్ బ్యూటీ బనితా సంధు హీరోయిన్‌గా నటించింది. కాగా సిల్వర్‌ స్ర్కీన్‌పై ప్రేమికులుగా నటించి మెప్పించిన ఈ జోడీ నిజ జీవితంలోనూ ప్రేమయాణం సాగిస్తోందని ప్రచారం సాగుతుంది. వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సోషల్‌ మీడియాతో పాటు తమిళ మీడియాల్లో వార్తలు వస్తు్న్నాయి. తాజాగా ఈ రూమర్లకు బలాన్నిస్తూ ధ్రువ్‌- బనితాలకు సంబంధించిన ఫొటోలు కొన్ని నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ జంట కలిసి దుబాయ్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ హోటల్‌ రూం బాల్కానీలో బనిత నిలబడిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ శుభాకాంక్షలు తెలిపాడు ధ్రువ్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ధృవ్‌, బనితలను ఇలా చూసి వారి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? అంటూ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రేమికుల ఫొటోలను రీట్వీట్‌ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ‘ఆదిత్య వర్మ’ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత ధృవ్‌ నటించిన రెండవ చిత్రం ‘మహాన్‌’. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బనిత కూడా బాలీవుడ్‌ లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది. గతేడాది అక్టోబర్‌లో ‘హూవీ’ తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రిటిష్‌ బ్యూటీ.. ఆ తర్వాత విక్కీ కౌశల్‌ ‘సర్దార్ ఉద్దమ్‌’లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘కవిత అండ్‌ థెరిసా’ సినిమాలో నటిస్తోంది.
Also Read:

Valimai: తలాతో పోటీపడాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. వలిమై సినిమాపై కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు..

Shyam Singha Roy: సరికొత్త ప్రయోగానికి ‘శ్యామ్ సింగరాయ్’ శ్రీకారం.. ఆకట్టుకుంటోన్న నాని సినిమా కొత్త ట్రైలర్‌..

Lionel Messi: క్రీడా రంగంలో కరోనా కలకలం.. కరోనా బారిన మెస్సీ.. మరో ముగ్గురు ప్లేయర్లకు కూడా పాజిటివ్‌..