Deepthi Sunaina: నేను ఒంటరిని కాదు.. తండ్రితో ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేసిన దీప్తి సునయన..

|

Jan 07, 2022 | 8:18 PM

యూట్యూబ్‌ స్టార్స్‌ దీప్తి సునయన- షణ్ముఖ్‌ల బ్రేకప్‌ స్టోరీ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గానే ఉంది.

Deepthi Sunaina: నేను ఒంటరిని కాదు.. తండ్రితో ఎమోషనల్‌ వీడియోను షేర్‌ చేసిన దీప్తి సునయన..
Deepthi Sunaina
Follow us on

యూట్యూబ్‌ స్టార్స్‌ దీప్తి సునయన- షణ్ముఖ్‌ల బ్రేకప్‌ స్టోరీ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గానే ఉంది. ఎంతో అన్యోన్యంగా, చూడచక్కగా ఉన్న ఈ జంట అనూహ్యంగా విడిపోవడం ఇప్పటికీ చాలామంది నమ్మలేకపోతున్నారు. బిగ్‌బాస్‌ షోలో కూడా షణ్నూకు చివరిదాకా సపోర్ట్‌గా నిలిచిన సునయన షో పూర్తయిన వెంటనే అతనితో బ్రేకప్‌ చెప్పేసి షాక్‌ ఇచ్చింది. తమ ఇద్దరి దారులు వేరంటూ 5 ఏళ్ల రిలేషన్‌షిప్‌కు వీడ్కోలు పలికింది. కాగా షణ్నూతో బ్రేకప్‌ తర్వాత ఆ చేదు అనుభవాన్ని మర్చిపోయేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది దీప్తి. ఇందుకోసం సోషల్‌ మీడియానే వేదికగా ఎంచుకుంటోంది. అభిమానులు, నెటిజన్లతో లైవ్‌ ముచ్చట్లు చెబుతోంది.

నాన్న ప్రేమతో జయిస్తాను..
కాగా తాజాగా తన తండ్రితో కలిసి ఉన్న ఓ వీడియోను షేర్‌ చేసింది దీప్తి. అందులో తన తండ్రితో కలిసి సరదాగా ముచ్చట్లు చెప్పడంతో పాటు చిరునవ్వులు చిందించింది. అనంతరం సోషల్‌ మీడియాలో ఈ వీడియోను పంచుకుంటూ.. ‘ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అదే తండ్రి ప్రేమ. జీవితంలో అత్యంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా తండ్రి ప్రేమతో వాటిని జయిస్తాను ‘ అంటూ చెప్పుకొచ్చింది దీప్తి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ‘క్యూట్‌ వీడియో’ ‘డ్యాడీస్‌ లిటిల్ ప్రిన్సెస్‌’, అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.

Also read:

Coronavirus: ఒమిక్రాన్‌పై ఆందోళన అవసరం లేదు.. ఇంటి నుంచే సాధారణ చికిత్స తీసుకుంటే బయటపడవచ్చు: దక్షిణఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్‌పర్సన్‌

Delhi: జైలు అధికారులను చూసి మొబైల్‌ ఫోన్‌ను మింగేసిన ఖైదీ.. ఆపై ఏం జరిగిందంటే..

అయ్యప్పస్వామి దర్శనం కోసం అన్నాచెల్లెళ్ల 580 కిలోమీటర్ల పాదయాత్ర.. చిన్నారుల భక్తిని చూసి ఆశ్చర్యపోతున్న జనాలు..