అల్లు ఫ్యామిలీతోనే కాదు.. పవన్, నా మధ్య అలాంటి పుకార్లే వచ్చాయి

సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిపై పుకార్లన్నవీ సర్వసాధారణం. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీపై ఎన్నో గాసిప్‌లు వచ్చాయి.

అల్లు ఫ్యామిలీతోనే కాదు.. పవన్, నా మధ్య అలాంటి పుకార్లే వచ్చాయి
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 8:05 AM

సినీ ఇండస్ట్రీలో ఉన్న వారిపై పుకార్లన్నవీ సర్వసాధారణం. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీపై ఎన్నో గాసిప్‌లు వచ్చాయి. చిరు, అల్లు అరవింద్‌ మధ్య మనస్పర్థలు వచ్చాయని.. మెగా, అల్లు ఫ్యామిలీలు అంటీముట్టనట్లుగా ఉన్నారని గతంలో పలు రకాలు వార్తలు వినిపించాయి. వాటిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్బంగా అల్లు ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. ”నాకు, అల్లు అరవింద్‌కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. మా రెండు కుటుంబాలు తరచుగా కలుస్తూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాలుగా మా రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఉంది. మేమంతా ఒకే కుటుంబం. ఏ విషయాల్లోనైనా నాకు సలహాలు కావాలనుకున్నప్పుడు అల్లు అరవింద్‌ను కలుస్తా. ఆయన కూడా సలహాల కోసం నన్ను కలుస్తూనే ఉంటారు. ఇలాంటి పుకార్లే పవన్‌, నా మధ్య కూడా వచ్చాయి. పవన్ నాకు ఇష్టమైన తమ్ముడు. మా తల్లి, నా భార్య పవన్‌కు ఇష్టమైన వంటకాలు చేసి పంపుతుంటారు. ఇలాంటి పుకార్లు వచ్చిన ప్రతిసారి స్పందించాల్సిన అవసరం లేదు” అని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చేశారు.