
పైన కనిపిస్తున్న ఫోటోను గమనించారా.. ? అందులో జూనియర్ ఎన్టీఆర్ తో క్లోజ్ ఉన్న ఆ ఇద్దరు ఎవరో గుర్తుపట్టండి. అప్పట్లో ఆ ఇద్దరు తారక్ ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం ఈ పాత ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. ఆ ముగ్గురిని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఆ ఇద్దరిని గుర్తుపట్టారా.. ? వాళ్లెవరో కాదండి.. వైసీపీ నాయకులు మాజీ మంత్రి కొడాలి నాని. అలాగే వల్లభనేని వంశీ. అప్పట్లో ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికి తెలిసిన విషయమే. తారక్ తండ్రి హరికృష్ణ అంటే కొడాలి నానికి అమితమైన గౌరవం, అభిమానం. టీడీపీ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాని.. ఆ సమయంలోనే తారక్ తో స్నేహం కుదిరింది. అప్పట్లో వీరిద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండేవారు.అలాగే వల్లభనేని వంశీ సైతం సన్నిహితంగా ఉండేవారు.
ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: ఆమె గొప్ప నటి.. ఆమె టాలెంట్ స్వయంగా చూశా.. కానీ సక్సెస్ కాలేకపోయింది.. కారణం ఇదే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన విషయాలను కొడాలి నాని చూసుకునేవారని గతంలో పలువురు డైరెక్టర్ సైతం వెల్లడించారు. ఒకప్పుడు ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరు ముగ్గురు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తారక్ సినిమాలపై పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ నెలకొంది. ట్రిపుల్ ఆర్ మూవీతో వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. బ్యా్క్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇటీవలే దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ పై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్ నటిస్తుండగా.. చాలా నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Raviteja : జీవితంలో ఆయనను మర్చిపోలేను.. నన్ను మరో స్థాయికి తీసుకెళ్లాడు.. రవితేజ..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వివి వినాయక్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కు ఒక కథ చెప్పానని.. కథా చర్చల మధ్యలో ఉండగానే తారక్ స్నేహితుడు కొడాలి నాని అనుహ్యంగా అక్కడకు వచ్చారని అన్నారు. తారక్ పక్కన నిలబడి మాకు మాస్ కథ కావాలి కోరారని.. దీంతో రెండు రోజుల్లోనే ఆది స్టోరీ రాశానని అన్నారు. ఆ సమయంలో తానెంటో ప్రూవ్ చేసుకోవాలనే కసి ఉండేదని చెప్పుకొచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Babloo Prithiveeraj : హీరో కంటే బాగా చేశానని ఆ సినిమాలో నా సీన్స్ తీసేశారు.. దెబ్బకు సినిమా రిజల్ట్ మారిపోయింది.. నటుడు పృథ్వీరాజ్..
Unseen Pic Of @tarak9999 💥#ManOfMassesNTR pic.twitter.com/1WXvoKsXVC
— NTR Trends (@NTRFanTrends) August 24, 2022
ఎక్కువ మంది చదివినవి : JD Chakravarthy : 25 ఏళ్లుగా ఆ ఒక్కటి తినడం మానేసా.. 56 ఏళ్ల వయసులో నా హెల్త్ సీక్రెట్ ఇదే.. జేడీ చక్రవర్తి కామెంట్స్..