Viral Photo: వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ కుందనపు బొమ్మ ఎవరో గుర్తుపట్టారా?

Viral Photo: పై ఫొటోలో వయ్యారంగా నిలబడి ఉన్న ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ ప్రారంభంలో ఐరన్‌ లెగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అదృష్టం మార్చుకుందామని బాలీవుడ్‌కు వెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది.

Viral Photo: వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ కుందనపు బొమ్మ ఎవరో గుర్తుపట్టారా?
Poojahegde

Updated on: Apr 15, 2022 | 6:34 PM

Viral Photo: పై ఫొటోలో వయ్యారంగా నిలబడి ఉన్న ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ ప్రారంభంలో ఐరన్‌ లెగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అదృష్టం మార్చుకుందామని బాలీవుడ్‌కు వెళ్లినా అదే పరిస్థితి ఎదురైంది. చివరకు తనకు మొదటి అవకాశం కల్పించిన టాలీవుడ్‌కే వచ్చేసింది. అందం, అభినయంతో అనతికాలంలోనే దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపుతెచ్చుకుంది. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, మహేశ్‌బాబు, ప్రభాస్‌, విజయ్‌ లాంటి టాప్‌స్టార్లతో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది. హీరోయిన్‌గా చేస్తూనే అప్పుడప్పుడు స్పెషల్‌ సాంగ్‌లకు సై అనే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌. చాలాకాలం తర్వాత మళ్లీ ఓ స్పెషల్ సాంగ్‌లో నటించనున్న ఈ అందాల తార ఫొటోను ఒక ప్రముఖ దర్శకుడు ట్విట్టర్‌ లో షేర్‌ చేశాడు. ఇందులో ఉన్న హీరోయిన్ ఎవరో చెప్పాలంటూ తన అభిమానులకు, నెటిజన్లకు ఓ చిన్న టెస్ట్ పెట్టాడు. మరీ ఇంతకీ ఈ పొడుగుకాళ్ల సుందరి ఎవరంటే..

పూజా హెగ్డే.. ముకుందతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈముద్దుగుమ్మ దువ్వాడ జగన్నాథం, అలవైకుంఠపురం, అరవిందసమేత, మహర్షి సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. గత నెలలో ప్రభాస్‌ తో కలిసి రాధేశ్యామ్‌ సినిమాతో మన ముందుకొచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల బీస్ట్‌ సినిమాతో అభిమానులను పలకరించింది. కాగా గతంలో రంగస్థలం సినిమాలో జిగేలురాణి అనే స్పెషల్‌ సాంగ్‌లో నటించి ఉర్రూతలూగించింది పూజ. ఇప్పుడు మళ్లీ మరోసారి అదే తరహా పాటలో కనిపించనుంది. వరుణ్‌తేజ్‌, వెంకటేశ్‌ హీరోలుగా నటిస్తోన్న ‘F3’ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో నటిస్తోందీ అమ్మడు. తాజాగా ఈ సొగసరికి సంబంధించిన లుక్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

Also Read:YS Sharmila: షర్మిల పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు శివారెడ్డి.. వైరల్‌గా మారిన మిమిక్రీ వీడియో..

Viral Video: రెప్పపాటులో పిడుగు పాటు.. కారువైపు ఎలా దూసుకొచ్చిందే చూడండి..

Hyderabad: వాహనదారులకు అలర్ట్‌.. పెండింగ్‌ చలాన్ల డిస్కౌంట్‌కు ఇంకా కొన్ని గంటలే..