మలయాళంలో తెరకెక్కిన దృశ్యం సినిమా తరువాత చాలా భాషల్లో రీమేక్ అయ్యింది. అయిన అన్ని చోట్లా సూపర్ హిట్ అయ్యింది కూడా. రీసెంట్గా మలయాళ మేకర్స్ ఆ సినిమాకు సీక్వెల్‌ను రూపొందించి మరో బిగ్ హిట్ ఇచ్చారు. దీంతో గతంలో రీమేక్ చేసిన మేకర్స్ అంతా సీక్వెల్ మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే తెలుగులో ఈ రీమేక్, షూటింగ్ కూడా పూర్తయ్యింది. అలాగే హిందీలోనూ రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనోరమా స్టూడియోస్ దృశ్యం 2 రీమేక్ హక్కులు సొంతం చేసుకుంది. అయితే అక్కడే అసలు చిక్కు మొదలైంది. తొలి భాగాన్ని వయాకామ్ 18 సంస్థ నిర్మించింది. దీంతో రీమేక్ హక్కుల విషయంలో వివాదం జరుగుతోంది.
సీక్వెల్ కోసం తొలి భాగం నుంచి కొన్ని సన్నివేశాలను తీసుకోవాల్సి ఉంటుంది. రీమేక్ హక్కులు తమకే కావలంటున్న వయాకామ్ 18 ఇతర నిర్మాతలు సీక్వెల్ నిర్మిస్తే ఫస్ట్ పార్ట్ విజువల్స్ వాడుకునేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో పనోరమా స్టూడియోస్‌కు ఏం చేయాలో అర్ధం కావటంలేదు. ఇప్పటికే వ్యవహారం కోర్టుకు చేరటంతో.. కోర్టు నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని ఫిక్స్ అయ్యారు నయా ప్రొడ్యూసర్స్.
Also Read: ఆంధ్రాలో కొత్తగా 14,986 పైగా కరోనా కేసులు.. మరణాల సంఖ్య ఎంతంటే..