
సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైలే కాస్త వేరుగా ఉంటుంది. లగ్జరీ కార్లు, కాస్ట్లీ బట్టలు, ఖరీదైన బంగ్లాలు అంటూ రచ్చ రచ్చ చేస్తుంటారు. కొందరు మాత్రమే చాలా సింపుల్ గా, ఎంత డబ్బున్నా, స్టార్ డమ్ ఉన్నా కామన్ పీపుల్ గా లైఫ్ లీడ్ చేస్తుంటారు. బాలీవుడ్ సెలబ్రెటీల లైఫ్ స్టైల్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రాత్రైతే మాత్రం.. పబ్స్ పార్టీస్.. రెస్టారెంట్స్ ముందు వీరి హంగామా మాములుగా ఉండదు. అదే వీకెండ్స్‌లో అయితే మాత్రం ఈ రచ్చ పీక్స్‌లో ఉంటుంది. చాలా మంది బీ టౌన్ సెలబ్రెటీలు కెమెరా కంట్లో పడి వైరల్ అవుతుంటారు.
ఆఫ్టర్ పార్టీ వీరి కాళ్లు తడబడడం.. అవి కాస్తా కెమెరాలకు చిక్కి నెట్టింట వైరల్ అవడం చాలా సార్లు జరిగింది . ఇక ఇప్పుడు సెలబ్రిటీ.. మోడల్..కు సంబందించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇది పాత వీడియోనే అయినప్పటికీ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ వీడియో. ఆ వీడియోలో ఉన్నది మరెవరో కాదు బాలీవుడ్ అందాల భామ ఉర్ఫీ జావేద్.
ఈ ఓల్డ్ వైరల్ వీడియోలో ఆప్టర్ పార్టీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ.. తూలుతూ నడవడం చూడొచ్చు. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త కొత్త.. విచిత్రమైన అవుట్ ఫిట్స్‌లో కనిపించి బీ టౌన్‌లో సెన్సేషనల్ అయ్యే ఉర్ఫీసోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించే పేర్లలో ఉర్ఫీ జావేద్ ఒకరు. ఉర్ఫీ జావేద్‌కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు దరిస్తుందో ఊహించడం చాలా కష్టం. ఉర్ఫీ జావేద్ తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది. తాజాగా ఉర్ఫీ జావేద్ కి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి