Urfi Javed: KGF మూవీ చూడనందుకు ఫీల్ అవుతున్నా.. రామ్ చరణ్ హ్యాండ్‌సమ్ హీరో అంటున్న ఉర్ఫీ జావేద్..

Urfi Javed: బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా( Social Media)లో యాక్టివ్‌గా ఉండేవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు. హిందీ బిగ్‌బాస్(Hindi Biggboss) ఓటీటీ(OTT) ..

Urfi Javed: KGF మూవీ చూడనందుకు ఫీల్ అవుతున్నా.. రామ్ చరణ్ హ్యాండ్‌సమ్ హీరో అంటున్న ఉర్ఫీ జావేద్..
Kgf Ram Charan

Updated on: Apr 07, 2022 | 12:12 PM

Urfi Javed: బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియా( Social Media)లో యాక్టివ్‌గా ఉండేవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు. హిందీ బిగ్‌బాస్(Hindi Biggboss) ఓటీటీ(OTT)  కంటెస్టెంట్‌గా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నఈ హాట్ హాట్ భామ  రోజూ ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సుందరి తాను యష్  KGF పార్ట్ 1 మూవీని చూడలేదని.. అందుకు బాధపడుతున్నట్లు చెప్పింది. అంతేకాదు.. రామ్ చరణ్ చాలా   హ్యాండ్‌సమ్ అంటూ కితాబు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

ఉర్ఫీ జావేద్  మళ్ళీ తన స్టైల్ లో దుస్తులు ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇటీవల, పాప్స్‌తో ఇంటరాక్షన్‌లో..  ఉర్ఫీ యష్  KGF సినిమా, రామ్ చరణ్ గురించి మాట్లాడింది. మీరు KGF.. 2 ట్రైలర్‌ని చూశారా అని అడిగినప్పుడు.. తాను అసలు KGF  ప్రీక్వెల్ కూడా చూడలేదని వెల్లడించింది. ఇది నాకు చాలా బాధ కలిగిస్తుందని.. అయితే త్వరలో చూడాలనుకుంటున్న అని చెప్పింది. ఇప్పుడు దక్షిణాది సినిమాల క్రేజ్ ఎక్కువగా ఉంది.. మీకు ఏ హీరో అంటే ఇష్టం అని అంటే.. రామ్ చరణ్ అని చెబుతూ.. తాను చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడని అంది.

Also Read: Uttar Pradesh: భార్యను బండిలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లిన వృద్ధుడు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ఉప ముఖ్యమంత్రి

Viral: చేపల కోసం వల వేసిన జాలరి… బయటకు తీయగా మైండ్ బ్లాంక్ అయ్యే సీన్