Bharti Singh: ది కపిల్ శర్మ షో తో మంచి గుర్తింపు తెచ్చుకుంది భారతీ సింగ్. ఇందులో ఆమె లల్లి పాత్రలో కామెడీ పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతోంది. అదేవిధంగా కామెడీ సర్కస్, ఝలక్‌దిక్లాజా, బిగ్‌బాస్, నచ్‌బలియే, ఖత్రోన్ కే ఖిలాడీ, డ్యాన్స్ దీవానే తదితర రియాలిటీ షోలతో బాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. దీంతో పాటు కొన్ని హిందీ, పంజాబీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. కాగా భారతి సింగ్ (Bharti Singh) హార్ష్ లింబచియాను 2017 డిసెంబర్‌లో గోవాలో వివాహం చేసుకుంది. తమ ఐదేళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా ఈనెల 4న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఈ కామెడీ క్వీన్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ మురిసిపోయారు ఈ లవ్లీ కపుల్. బాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు అంతా వీరికి శుభాకాంక్షలు తెలియచేశారు.
అయితే అమ్మగా ప్రమోషన్ పొందిన 12 రోజులకే ఆమె షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఆమె అభిమానులు సూపర్ వుమెన్ అని భారతీసింగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పని విషయంలో ఆమె నిబద్ధతను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో కొందరు నెటిజన్లు ఆమెను తప్పుపడుతున్నారు. ఈ సమయంలో పురిటిబిడ్డను చూసుకోవాల్సింది పోయి డబ్బుల కోసం అప్పుడే షూటింగ్ సెట్స్‌కు వెళ్తున్నావా? అని తిట్టిపోస్తున్నారు. కనీసం నెల రోజులు కూడా బిడ్డతో ఉండలేకపోయావా ? అని మండిపడుతున్నారు. జీవితంలో దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకో అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ముందుగా కుదుర్చుకున్న కమిట్ మెంట్స్ వల్ల వెంటనే షూటింగ్‌కు రావాల్సి వచ్చిందని.. పసిబిడ్డతో గడపలేకపోతున్నందుకు బాధపడుతున్నట్లు భారతీ చెప్పుకొచ్చింది.
Also Read: JP Nadda: బీజేపీ ఉన్నచోట మిషన్.. కాంగ్రెస్ ఉన్నచోట కమిషన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన జేపీ నడ్డా
Multibagger Stock: రెండేళ్ల కాలంలో లక్షను.. 90 లక్షలు చేసిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్..