
Raveena Vs Katrina: బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ‘సూర్యవంశీ’ చిత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సూర్యవంశీతో పాటు ఈ చిత్రంలోని ‘టిప్-టిప్ బర్సా పానీ’ పాట కూడా సోషల్ మీడియా చర్చలో ఉంది. ఈ పాటలో కత్రినా స్టైల్ అందరినీ మరోసారి హర్ట్ చేసేలా ఉంది. అయితే, ‘టిప్ టిప్ బర్సా పానీ’ 1994 చిత్రం ‘మొహ్రా’లో కనిపించింది. ఇందులో రవినా టాండన్, అక్షయ్ కుమార్ల కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. ఇది ఆ పాటకు.. ఆ సినిమాకు ఫ్యాన్స్ అంతా ఇంతా కాదు.. ఉత్తరాది, దక్షిణాది తేడాల్లేకుండా సూపర్ హిట్ అయిన పాట ఇదే. అంతలా అభిమానులను దక్కించుకుంది. భారత దేశంలోని చాలా మంది సినిమా ప్రేమికులు ఈ పాటను.. అందులోని వారిని కెమిస్ట్రీని ఎప్పటికీ మరచిపోలేకపోతున్నారు.
ఆడియో క్యాసెట్ల హవా నడుస్తున్న సమయంలో ప్రతి ఇంట్లో ఈ పాట వినిపించేది. అంటే అర్థం చేసుకోవచ్చు. ఆకాశవాణీ వివిధ భారతి ప్రోగ్రామ్‌లో ఎక్కువ సార్లు వినిపించిన పాట కూడా ఇదే.. అయితే అక్కడి నుంచి నెట్టింట్లోకి యూట్యూబ్ వచ్చిన తర్వాత కూడా ఈ సాంగ్ మోగుతూనే ఉంది. ఈ పాట ఏ సినిమాలోది.. ఆ సినిమాను ఎంత మంది చూశారనేది పక్కన పెడితే.. ఈ పాట మాత్రం ఆల్ టైమ్ సూపర్ హిట్స్‌లో ఒకటిగా చేరిపోయింది.
అయితే.. ఇప్పుడు ఈ ఎవర్గ్రీన్ హిట్ సాంగ్‌ను రీమేక్ చేశారు. రవీనా తర్వాత.. కత్రినా తన హాట్‌నెస్‌తో ప్రజల హృదయాల్లో ముద్ర వేసింది. కాబట్టి నెటిజన్లు సోషల్ మీడియాలో ఇద్దరినీ పోల్చడం మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో ఓ పెద్ద యుద్ధం నడుస్తోంది. ఈ పాట గురించి యూజర్లు తమ తమ అభిప్రయాలను పంచుకుంటున్నారు. రవినా టాండన్ చేసిన మ్యాజిక్‌ను.. కత్రినా విఫలమైందంటూ నెటిజన్లు హీట్ పెంచుతున్నారు.
ఆ హాట్ బ్యూటిఫుల్ రెయిన్ సాంగ్స్‌లో “టిప్ టిప్ బర్సా పానీ” అగ్రస్థానంలో ఉంది. మరి అద్భుతమైన పాటను రీమిక్స్ ఎలా చేస్తారంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. రీమిక్స్ చేసే సాహసం సూర్యవంశీ యూనిట్ ఎలా చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాట విలువ మీకు తెలుసా? అంటూ.. క్లాస్ పీకాల్సిన సమయం వచ్చింది అంటూ క్లాస్ పీకుతున్నారు. ఆ టెంపో ఏదీ? ఆ బీట్ ఏదీ? మీరు ఎంచుకున్న శ్రుతేమిటి? ఆ పాట శ్రుతేమిటి? మేము ఏదో ఊహించుకుంటాం.. మీరు మాత్రం అక్కడకు రారు! అని కత్రినాకైఫ్‌కే కాదు.. అక్షయ్ కుమార్‌కు కూడా క్లాస్ ఇస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు.
ఇవి కూడా చదవండి: Rafale Deal: మధ్యవర్తికి డసాల్ట్ ఏవియేషన్ రూ.481 కోట్ల లంచం.. మరోసారి తెరపైకి వచ్చిన రాఫెల్ డీల్ భూతం..
Sania Mirza Video: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..