నాకు లైసెన్స్ వచ్చిందోచ్… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సోనాక్షి సిన్హా ఫోటోలు..

|

Nov 28, 2020 | 4:22 PM

అలనాటి సూపర్‌స్టార్ శత్రఘ్న సిన్హా తనయ.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తనకు లైసెన్స్ వచ్చించోద్ అంటూ.. ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన రెండు ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

నాకు లైసెన్స్ వచ్చిందోచ్... సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సోనాక్షి సిన్హా ఫోటోలు..
Follow us on

అలనాటి సూపర్‌స్టార్ శత్రఘ్న సిన్హా తనయ.. బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తనకు లైసెన్స్ వచ్చించోద్ అంటూ.. ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన రెండు ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. లైసెన్స్ వచ్చిందంటే ఇంకేదో అనకుని కంగారు పడకండి. అసలు విషయం ఏంటంటే.. సోనాక్షి సిన్హాకు స్కూబా డైవింగ్ అంటే తెగ ఇష్టం అట. ఇప్పుడు ఆ స్కూబా డైవింగ్‌లో సోనాక్షి లైసెన్స్‌ను సాధించింది. స్కూబా డైవింగ్‌లో లైసెన్స్ పొందేందుకు తాను రాసిన పరీక్ష తాలూకు సమాధాన పత్రాన్ని, ట్రైనర్ వద్ద నుంచి లైసెన్స్ పత్రాలు అందుకుంటున్న రెండు ఫోటోలను సోనాక్షి తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది.

అయితే స్కూబా డైవింగ్‌లో లైసెన్స్ సాధించడంతో అమ్మడు తెగ ఆనందపడిపోతూ ఇలా పోస్ట్ చేసింది… ‘కొన్నేళ్లుగా స్కూబా డైవింగ్ లైసెన్స్ కోసం ప్రయత్నిస్తున్నాను. ఫైనల్‌గా దాన్ని సాధించాను. తొలిసారి స్కూబా డైవింగ్ చేసినప్పటి నుంచి సముద్రంపై ప్రేమ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు అది కాస్తా వేరే లెవెల్‌కు తీసుకెళ్తుంది అనుకుంటున్నాను. స్కూబా డైవింగ్‌లో శిక్షణ ఇచ్చిన మహమ్మద్‌ గారికి కృతజ్ఞతలు. నేను ఏ పరీక్షలోనూ ఇలా వందకు వంద శాతం మార్కులు తెచ్చుకోలేదు’ అంటూ సోనాక్షి తెగ మురిసిపోతుంది. దీనికి స్పందిస్తున్న ఆమె అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.