Sidharth Malhotra: ఆ హీరోయిన్‏తో ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకున్న సిద్ధార్థ్ ?.. పెళ్లి తర్వాత లైఫ్ అలా ఉండాలంటున్న హీరో..

అంతేకాకుండా వీరిద్దరు పలుమార్లు మీడియాకు చిక్కారు. దీంతో కియారా, సిద్ధార్థ్ రిలేషన్‏షిప్‏లో ఉన్నారనే రూమర్స్‏కు మరింత బలం చేకురింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు హీరో సిద్ధార్థ్.

Sidharth Malhotra: ఆ హీరోయిన్‏తో ప్రేమలో ఉన్నట్లు ఒప్పుకున్న సిద్ధార్థ్ ?.. పెళ్లి తర్వాత లైఫ్ అలా ఉండాలంటున్న హీరో..
Siddharth

Updated on: Aug 18, 2022 | 8:28 AM

బాలీవుడ్‏లో మరో ప్రేమజంట త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న ఆ ఇద్దరు స్టార్స్ తమ పెళ్లి, భవిష్యత్తు గురించి అనేక ప్లాన్స్ వేసుకున్నట్లుగా సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా (Sidharth Malhotra), కియారా అద్వానీ ప్రేమలో ఉన్నట్లు కొద్దిరోజులుగా బీటౌన్‏లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. *(Kiara Advani) వీరిద్దరి కాంబోలో వచ్చిన షేర్సా సినిమా సూపర్ హిట్ అయింది. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరు పలుమార్లు మీడియాకు చిక్కారు. దీంతో కియారా, సిద్ధార్థ్ రిలేషన్‏షిప్‏లో ఉన్నారనే రూమర్స్‏కు మరింత బలం చేకురింది. తాజాగా కాఫీ విత్ కరణ్ షో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టాడు హీరో సిద్ధార్థ్.

కాఫీ విత్ కరణ్ షోలో హీరో విక్కీ కౌశల్, సిద్ధార్థ్ మల్హోత్రా పాల్గొన్నారు. ఇందులో సిద్ధార్థ్, క్రియారా మధ్య ఉన్న బంధాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశాడు కరణ్. భవిష్యత్తు ప్రణాళికలు ఏంటీ అని ప్రశ్నించగా..సిద్ధార్థ్ స్పందిస్తూ.. నేను సంతోషకరమైన, ప్రకాశవంతమైన భవిష్యత్తును కోరుకుంటున్నాను అని చెప్పాడు. దీంతో కియారాతో నా అని కరణ్ తిరిగి క్వశ్చన్ చేశాడు. ఆమె అయితే ఇంకా బాగుంటుంది అంటూ తన ప్రేమ విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు. అలాగే గతంలో కాఫీ విత్ కరణ్ షోకు హీరో షాహిద్ కపూర్‏తో కలిసి కియారా వచ్చిన క్లి్ప్ ప్లే చేశాడు. అందులో సిద్ధార్థ్ గురించి అడగ్గా.. తామిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ అని కియారా చెప్పుకొచ్చింది. మొత్తానికి వీరిద్దరు ప్రేమలోనే ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us