Shahrukh Khan: 56 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌.. ‘పఠాన్’ లుక్స్‌కి అభిమానులు ఫిదా..!

Shahrukh Khan: బాలీవుడ్ బాద్‌ షా షారుక్‌ ఖాన్ తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ 'పఠాన్' నుంచి తన నయా లుక్‌ని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇందులో షారుక్

Shahrukh Khan: 56 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌.. పఠాన్ లుక్స్‌కి అభిమానులు ఫిదా..!
Shahrukh Khan

Updated on: Mar 27, 2022 | 6:05 AM

Shahrukh Khan: బాలీవుడ్ బాద్‌ షా షారుక్‌ ఖాన్ తన అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘పఠాన్’ నుంచి తన నయా లుక్‌ని ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇందులో షారుక్ ఖాన్‌ సరికొత్త రూపంలో దర్శనమిస్తున్నాడు. 3 ఏండ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత చేస్తున్న సినిమా కావ‌డంతో అభిమానులకి అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇందులో షారుక్ ఖాన్ 8 ప్యాక్ యాబ్స్‌తో పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఈ లుక్‌కి అందరు ఫిదా అవుతున్నారు. అలాగే అతని భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్ స్పెషల్ రియాక్షన్ ఇచ్చారు. గౌరీ ఖాన్ తన ట్విట్టర్ ఫీడ్‌లో రెడ్ హార్ట్ ఎమోజీతో ‘లవింగ్ ది పఠాన్ వైబ్’ అని క్యాప్షన్ ఇచ్చింది. అలాగే కూతురు సుహానా ఖాన్‌ కూడా తన మనసులోని మాటను అదుపు చేసుకోలేకపోయింది. మా నాన్న గారి వయసు 56 సంవత్సరాలు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదంటూ వ్యాఖ్యానించింది. ఇప్పటికే ప‌ఠాన్ సెట్స్ నుంచి షారుఖ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగతి తెలిసిందే.

ప‌ఠాన్ సినిమా రిలీజ్ డేట్‌కు సంబంధించిన వీడియోను మార్చి 2న షారుఖ్ విడుద‌ల చేశాడు. ఆ వీడియో కూడా వైర‌ల్ అయింది. ఈ సినిమా 25 జ‌న‌వ‌రి 2023న రిలీజ్ కానుంది. హిందీతో పాటు ఈ సినిమా తెలుగు, త‌మిళంలో విడుద‌ల కానుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్పెయిన్‌లో కొనసాగుతుంది. షారుక్‌ఖాన్‌తో పాటు దీపికా ప‌దుకొనే (Deepika Padukone), జాన్ అబ్రహాం (John Abraham)ల‌పై వ‌చ్చే కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

Tirupati: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన పెళ్లి బస్సు.. పలువురు మృతి

Vitamin C: విటమిన్ సి తో చర్మం కాంతివంతం.. సమ్మర్‌లో ఇలా చేయండి..!

Viral Video: అనుకున్నదొక్కటి.. అయిందొక్కటి.. ఈ యువతి పరిస్థితి చూస్తే మీరూ జాలిపడాల్సిందే!

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us