Salman Khan: ‘సరిగ్గా మసులుకో.. లేదా లారెన్స్ బిష్ణోయ్‌ను పిలుస్తా’.. సల్మాన్ ఖాన్ తండ్రికి మహిళ బెదిరింపు

|

Sep 19, 2024 | 3:10 PM

నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఆయనకు మరో బెదిరింపు వచ్చింది. గురువారం (సెప్టెంబర్ 19) సలీం ఖాన్ మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని మహిళ

Salman Khan: సరిగ్గా మసులుకో.. లేదా లారెన్స్ బిష్ణోయ్‌ను పిలుస్తా.. సల్మాన్ ఖాన్ తండ్రికి మహిళ బెదిరింపు
Salman Khan
Follow us on

నటుడు సల్మాన్ ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ పేరుతో ఆయనకు మరో బెదిరింపు వచ్చింది. గురువారం (సెప్టెంబర్ 19) సలీం ఖాన్ మార్నింగ్ వాక్ కోసం బయటకు వెళ్లిన సమయంలో గుర్తు తెలియని మహిళ ‘సరిగ్గా ప్రవర్తించడం తెలుసుకో.. లేదంటే లారెన్స్‌ బిష్ణోయ్‌ని పంపిస్తా’ అని బెదిరించింది. ఆ సమయంలో ఆమె బుర్ఖా ధరించి ఉందని సమాచారం. ఈ కేసుకు సంబంధించి గుర్తు తెలియని మహిళపై బాంద్రా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు. కాగా ఒక గుర్తుతెలియని మహిళ నుంచి సలీం ఖాన్‌కు బెదిరింపు రావడం ఇదే తొలిసారి. ఈ మహిళ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆమె నిజంగా బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యురాలేనా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విచారణంలో భాగంగా ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా కొన్ని నెలల క్రితం నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిగాయి. బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని సల్మాన్ ఇంటి గోడపై ఇద్దరు యువకులు కాల్పులు జరిపారు. కాల్పులకు పాల్పడింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్, సలీం ఖాన్‌లకు జూన్‌లో హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. సల్మాన్, సలీం ఖాన్‌ల భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఈ మధ్యన బెదిరింపు లేఖలు ఎక్కువయ్యాయి. దీంతో సలీం ఖాన్ రోజూ సెక్యూరిటీ గార్డులతో కలసి మార్నింగ్ వాక్ కి వెళుతున్నాడు. అయినా ఈ బెదిరింపులు ఆగడం లేదు. మరోవైపు, సల్మాన్‌ఖాన్‌ గురువారం ఉదయమే ముంబయి నుంచి విదేశాలకు వెళ్లారు. సల్మాన్ ఊరిలో లేని సమయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

కాగా సల్మాన్ ఖాన్ షూటింగ్ సమయంలో కృష్ణ జింకను వేటాడాడని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు ప్రతిఫలంగానే బిష్ణోయ్ గ్యాంగ్ అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇక సినిమా విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ ‘సిఖందర్’ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నాడు. ఈ చిత్రం 2025 ఈద్ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.