దక్షిణాది చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్గా భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది సమంత (Samantha). ప్రస్తుతం సౌత్ లో చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది సామ్. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తో నార్త్ ఆడియన్స్కు కూడా దగ్గరయిన ఈ చిన్నది.. ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో కలిసి కాఫీ విత్ కరణ్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో తన వ్యక్తిగత విషయాలు, ప్రేమ, పెళ్లి గురించి మాట్లాడిన సామ్.. తాను రణ్వీర్ సింగ్ అభిమానినంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తాను బ్యాచిలర్ పార్టీలో రణవీర్ సింగ్ తో డ్యాన్స్ చేస్తానని చెప్పింది. తాజాగా రణ్వీర్ సింగ్ సైతం తనకు సమంతతో ఓ మంచి సినిమా చేయాలనుందంటూ మనసులోని మాటలను బయటపెట్టాడు.
ఇటీవల బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను, సమంత కలిసి ఓ ప్రకటన షూట్ చేసినట్లు చెప్పాడు. రణ్వీర్ మాట్లాడుతూ.. “భవిష్యత్తులోనూ సమంతతో మంచి అనుబంధం కలిగి ఉంటాము. ఆమె అద్భుతమైన వ్యక్తి. అత్యంత ప్రతిభ కలిగిన మహిళ. ఇద్దరం కలిసి ఓ యాడ్ ఫిల్మ్ చేశాం. మేము మొదటి సారి అప్పుడే కలుసుకున్నాం. ఆమెను ఓ కళాకారణిగా..అద్భుతమైన వ్యక్తిగా ఎప్పుడూ అభినందిస్తాను. ఆమె చాలా అందంగా ఉంటుంది. తన సహ నటులతో సరదాగా కలిసిపోతుంది. భవిష్యత్తులో ఆమె కలిసి పూర్తి స్థాయి సినిమా చేయాలనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం సమంత యశోద, ఖుషి చిత్రాల్లో నటిస్తుంది. ఈ రెండు సినిమాల షూటింగ్ చివరి దశలో ఉన్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న శాకుంతలం మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.