Priyanka Chopra: బాలీవుడ్ నటిగా కెరీర్ మొదలు పెట్టి.. ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగారు నటి ప్రియాంక చోప్రా. ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్‌లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుందీ బ్యూటీ. ఇక నిత్యం ఏదో రకంగా వార్తల్లో నిలిచే ఈ మాజీ మిస్ వరల్డ్.. 2018లో అమెరికన్ పాప్ సింగర్ నిక్‌జోనస్‌ను ప్రేమ వివాహం చేసుకున్నవిషయం తెలిసిందే. వయసులో తనకంటే చిన్నవాడిని వివాహం చేసుకున్న ప్రియాంకపై అప్పట్లో నెటిజన్లు బాగా ట్రోలింగ్ చేశారు. అయితే ఈ జంట తమ అన్యోన్య జీవితంతో ఆ కామెంట్లకు చెక్ పెడుతూ వచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా నెట్టింట ప్రియాంకపై మరో ట్రోలింగ్ జరుగుతోంది. ప్రియాంక చోప్రా శరీరాకృతిపై కామెంట్లు పెడుతూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ఆమె శరీరంలో మార్పులు వచ్చాయంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఈ కామెంట్లపై ఎంతో విజ్ఞతతో స్పందించారు. తనపై జరుగుతోన్న బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ.. అవును ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటాను. రోజు రోజుకూ నా వయసు పెరుగుతున్న నేపథ్యంలో నా శరీరంలో కూడా మార్పులు వస్తున్నాయి. వీటిని స్వీకరించేందుకు నేను సిద్ధమవుతున్నాను. శరీరంలో వస్తోన్నమార్పుల వల్ల నేను ఇబ్బంది పడటం లేదనే అబద్ధాన్ని చెప్పలేను. ఒక నటిగా ఇది నాకు సమస్యగానే ఉంటుంది. కానీ నేను దీనిని స్వీకరించకతప్పదు. అంటూ తనదైన శైలిలో స్పందించారు ప్రియాంక.
Also Read: Nandamuri Balakrishna : బాలకృష్ణ కాదంటేనే ఆ సూపర్ హిట్ సినిమా పవన్ దగ్గరకు వెళ్లిందా..?
Puri Jagannadh : పూరీ చెప్పిన మంచిమాట.. జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి…కానీ
బాలకృష్ణ పక్కన హీరోయిన్‌గా నటించాలంటే కొంచెం భయమేసింది.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన హీరోయిన్..