Prabhas: బాలీవుడ్ హీరోయిన్‏కు సర్‏ఫ్రైజ్ ఇచ్చిన డార్లింగ్… షాకైన నటి.. ఇంతకు ఏం చేశాడో తెలుసా ?

|

Jul 02, 2021 | 5:10 PM

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 'బహుబలి' సినిమాతో ప్రభాస్ రెంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

Prabhas: బాలీవుడ్ హీరోయిన్‏కు సర్‏ఫ్రైజ్ ఇచ్చిన డార్లింగ్... షాకైన నటి.. ఇంతకు ఏం చేశాడో తెలుసా  ?
Prabhas
Follow us on

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మనస్తత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘బహుబలి’ సినిమాతో ప్రభాస్ రెంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్‏డమ్ సొంతం చేసుకోవడమే కాకుండా నార్త్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు ప్రభాస్. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఒదిగి ఉండడమే ప్రభాస్ స్పెషాలిటీ.. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్… ఇప్పటికీ సిప్లిసిటీగానే ఉంటాడు. షూటింగ్ స్పాట్‏లో అక్కడి నటీనటులతోపాటు..
టెక్నీషియన్స్‏తోనూ సరదాగా, స్నేహంగా ఉంటాడని ఇప్పటికే పలువురు యాక్టర్స్ ఎన్నో సందర్భాల్లో చెప్పుకోచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా.. ప్రతి పండుగకు.. పుట్టిన రోజులకు, స్పెషల్ డేస్ కు తనతోటి వారికి కానుకలు ఇచ్చి వారిని ఆశ్చర్యపరుస్తుంటాడు. తాజాగా రెబల్ స్టార్ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్య శ్రీ ఇంటికి గిఫ్ట్ పంపి ఆమెను సర్‏ఫ్రైజ్ చేశాడు.. కానుకలు అందుకున్న నటి భాగ్య శ్రీ.. వాటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆసక్తికర కామెంట్స్ చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. తెలుగు వంటకాలను ఎంతగానో ఇష్టపడుతుంటారన్న సంగతి తెలిసిందే. తన కోసమే కాకుండా.. షూటింగ్ సమయంలోనూ అందరికి గోదారి వంటకాలను తెప్పిస్తుంటారు. తాజాగా నటి భాగ్య శ్రీకి ప్రభాస్ ఆంధ్ర పూతరేకులను కానుకలుగా పంపించాడు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ” మరిన్ని హైదరాబాద్ స్వీట్స్ అందాయి. థ్యాంక్స్ ప్రభాస్.. నా అభిరుచిని మార్చావు.. ” అంటూ కామెంట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం ప్రభాస్.. రాధకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో నటి భాగ్య శ్రీ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా… త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ట్వీట్..

Also Read: Indian Woman fly into space: అంతరిక్షంలోకి ఆంధ్రా అమ్మాయి.. స్పేస్ ఫ్లేస్ సంపాదించి గుంటూరు యువతి

Vaccine Centres in MP: వ్యాక్సిన్ కోసం నిబంధలు వదిలి జనం తొక్కిసలాట.. ఇలాఐతే ఎన్ని వేవులైన వస్తాయంటూ ఆందోళన