Parineeti Chopra: ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ప్రెగ్నెన్సీతో ఉన్నట్టా ?.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్..

వరుస సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను గతేడాది వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‏లోని ఉదయ్‏పూర్‏లో సెప్టెంబర్ 24న ఘనంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పరిణితి.. ఇప్పుడు చమ్కీలా చిత్రంతో రీఎంట్రీ ఇస్తుంది. దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నారు. అమర్ సింగ్ బయోపిక్‏గా వస్తున్న ఈ మూవీలో పరిణితి కథానాయికగా నటించింది.

Parineeti Chopra: ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ప్రెగ్నెన్సీతో ఉన్నట్టా ?.. హీరోయిన్ స్ట్రాంగ్ కౌంటర్..
Parineeti Chopra
Follow us

|

Updated on: Mar 29, 2024 | 7:20 AM

బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ మోస్ట్ హీరోయిన్లలో పరిణితి చోప్రా ఒకరు. అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. కంటెంట్ ప్రాధాన్యత..బలమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాను గతేడాది వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‏లోని ఉదయ్‏పూర్‏లో సెప్టెంబర్ 24న ఘనంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పరిణితి.. ఇప్పుడు చమ్కీలా చిత్రంతో రీఎంట్రీ ఇస్తుంది. దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 12న రిలీజ్ చేయనున్నారు. అమర్ సింగ్ బయోపిక్‏గా వస్తున్న ఈ మూవీలో పరిణితి కథానాయికగా నటించింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. అయితే ప్రచార కార్యక్రమాల్లో పరిణితి కూడా పాల్గొంటుంది.

ఈ క్రమంలోనే ఇటీవల చమ్కీలా ప్రమోషన్లలో పరిణితి డ్రెస్సింగ్ కాస్త విభిన్నంగా కనిపించింది. దీంతో ఎప్పటిలాగే ఆమె ప్రెగ్నెన్సీతో ఉందంటూ నెట్టింట ప్రచారం మొదలైంది. కొద్ది రోజుల క్రితం ఎయిర్ పోర్టులో వైట్ కలర్ అవుట్ ఫిట్ ధరించి కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట కామెంట్స్ చేశారు. అలాగే ఎప్పుడూ తేలికైనా దుస్తులు ధరిస్తుందని.. ఆమె త్వరలోనే తల్లికాబోతుందంటూ రూమర్స్ మొదలయ్యాయి. ఇక చమ్కీల ప్రచార కార్యక్రమాల్లోనూ కాఫ్తాన్ దుస్తులు.. సౌకర్యవంతగా ఉండేలా తేలికైనా కుర్తా ధరించి కనిపించింది. దీంతో మరోసారి ప్రెగ్నెన్సీ రూమర్స్ వైరలయ్యాయి. ఇక ఈ కామెంట్స్ పై పరిణితి గట్టిగానే రియాక్ట్ అయ్యింది.

Parineeti Chopra Love

Parineeti Chopra Love

“కఫ్తాన్ దుస్తులు = ప్రెగ్నెన్సీ, భారీ చొక్కా = ప్రెగ్నెన్సీ, సౌకర్యవంతమైన ఇండియన్ కుర్తా = ప్రెగ్నె్న్సీ” అంటూ నవ్వుతున్న ఎమోజీని షేర్ చేసింది. దీంతో ఇప్పుడు పరిణితి షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇదిలా ఉంటే.. పరిణితి, దిల్జిత్ దోసాంజ్ కలిసి నటించిన చమ్కీలా సినిమాకు ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించారు. ఇందులో అమర్ సింగ్ భార్య పాత్రలో కనిపించనుంది. పరిణితి చివరిసారిగా మిషన్ రాణిగంజ్ సినిమాలో కనిపించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.