`99 సాంగ్స్‌` కోసం రైట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా చేసిన ప్ర‌యాణం ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

|

Apr 12, 2021 | 10:46 PM

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`. ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ జంట‌గా న‌టించారు.

`99 సాంగ్స్‌` కోసం రైట‌ర్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా చేసిన ప్ర‌యాణం ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌
Ar Rahman
Follow us on

99 Songs: ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్‌, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేమ‌క‌థా చిత్రం `99 సాంగ్స్‌`. ఇహాన్ భ‌ట్‌, ఎడిల్‌సీ జంట‌గా న‌టించారు. విశ్వేష్‌ కృష్ణ‌మూర్తి తెర‌కెక్కించిన‌ ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఏప్రిల్ 16, 2021న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా చిత్ర యూనిట్ వెబినార్‌లో ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్, హీరో ఇహాన్ భ‌ట్‌ మీడియాతో మాట్లాడారు. ఏ ఆర్ రెహమాన్ మాట్లాడుతూ…”మ్యూజిక్ కంపోజ‌ర్‌గా 29 ఏళ్లు వ‌ర్క్ చేశాను. ఇర‌వై ఏళ్ల త‌ర్వాత మ్యూజిక్‌, ఆర్ట్ వ‌ర్క్స్‌కు సంబంధించిన మ‌రింత లోతుగా ప్ర‌యాణాన్ని ప్రారంభించాల‌ని అనుకున్నాను. ఇప్పుడు తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో గొప్ప ద‌ర్శ‌కులున్నారు. అమేజింగ్ మూవీస్ చేస్తున్నారు. ఆ క్ర‌మంలో వచ్చిన ఆలోచ‌నే `99 సాంగ్స్‌`. సినిమా మ్యూజిక్‌కు సంబంధించిన సినిమానే అయినా అందులో చాలా లేయ‌ర్స్ ఉన్నాయి. గ‌త ద‌శాబ్దంలోని ఆడియెన్స్‌కు, ఇప్ప‌టి ఆడియెన్స్‌కు చాలా తేడా ఉంది” అన్నారు. అలాగే  `99 సాంగ్స్‌`కు మెయిన్ సోల్ మ్యూజిక్‌.. నేను `99 సాంగ్స్‌` సినిమాను పాత ప్ర‌పంచం, కొత్త ప్ర‌పంచానికి మ‌ధ్య ఉన్న వేరియేష‌న్‌ను చూపించేలా తెర‌కెక్కించాం.

నేను నా జ‌ర్నీలో ఎంతో మంది అమేజింగ్ డైరెక్ట‌ర్స్‌తో ప‌నిచేశాను. వారితో క‌లిసి ఇంకా ప‌నిచేయాల‌ని కూడా అనుకుంటున్నాను. అయితే మ‌రి ఆ ద‌ర్శ‌కుల‌ను తీసుకోకుండా విశ్వేష్‌ కృష్ణ‌మూర్తిని ఎందుకు తీసుకున్నాన‌ని చాలా మంది అనుకోవ‌చ్చు. అయితే నేను ఇక్క‌డ చెప్పాల‌నుకున్న విష‌య‌మేమంటే.. నేను ఈ సినిమాకు రైట‌ర్‌గా కూడా వ‌ర్క్ చేశాను. ఓ ఎక్స్‌పీరియెన్స్‌డ్ డైరెక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి రైట‌ర్‌గా మాట్లాడితే.. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గానే చూస్తారు. అది కాస్త ఇద్ద‌రికీ ఇబ్బందిగా అనిపించొచ్చు. అందువ‌ల్ల నేటి జ‌న‌రేష‌న్‌కు త‌గినట్టు ఓ కొత్త డైరెక్ట‌ర్‌తో చేయాల‌ని అనుకున్నాను. అలా విశ్వేష్ కృష్ణ‌మూర్తి ప్రాజెక్ట్‌లోకి వ‌చ్చారు. ఇద్ద‌రం కొత్త వాళ్లం కాబ‌ట్టి ఓ అవ‌గాహ‌న‌తో ముందుకెళ్లొచ్చు అనిపించింది అన్నారు. సంగీతం అనేది త‌రాల‌ను, సంస్కృతుల‌ను క‌లిపే ఓ సాగ‌రం. ఈ సినిమాలో కూడా హీరో పాత్ర పాత త‌రానికి, కొత్త త‌రానికి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ ప‌డుతుంటాడు. ఈ పాయింట్ ప్రేక్ష‌కుల‌ను న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు ప్రేక్ష‌కులు ప్ర‌పంచ సినిమాను వీక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో వారు మ‌న సినిమాను మ‌రో రేంజ్‌లో చూడాల‌ని అనుకుంటున్నారు. అలాంటి వారి కోణంలో ఈ సినిమాను ఓ రైట‌ర్‌గా, నిర్మాత‌గా రూపొందించాను. నా ప్ర‌య‌త్నానికి విశ్వేష్ వంటి వాళ్లు స‌పోర్ట్‌ను అందించారు. జియో సంస్థ మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చింది. ప్ర‌తి భాష‌లో సినిమాను ప్రేక్ష‌కుడు ఒరిజిన‌ల్ మూవీ అని ఫీల్ కావాల‌ని అన్ని భాష‌ల్లో రూపొందించాం. కొత్త న‌టీన‌టుల‌తో మూడు భాష‌ల్లో సినిమా చేయ‌డ‌మే కాదు.. దాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకు వ‌స్తున్నాం. ఇదే మా గొప్ప స‌క్సెస్ అని భావిస్తున్నాను.

ఇది నా క‌థ కాదు. ఈ సినిమాకు నా లైఫ్ పూర్తి విరుద్ధంగా ఉంటుంది. నాన్న‌గారు మ్యూజిక్ చేశారు.. నువ్వు కూడా మ్యూజిక్ చెయ్ అని అమ్మ చెప్ప‌డంతో నేను మారు మాట్లాడ‌కుండా మ్యూజిక్ చేశాను. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే.. ఇది ఎలాంటి మ్యూజిక్ బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి ఓ యువ‌కుడు మ్యూజిక్ రంగంలోకి అడుగు పెడితే ఎలా ఉంటుంద‌నే పాయింట్‌ను ట‌చ్ చేస్తున్నాం. నేను నిర్మాత‌గా మారాల‌ని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమా విష‌యానికి వ‌చ్చేటప్ప‌టికి.. కొన్ని కొత్త విష‌యాల‌ను చేయాల‌నుకున్న‌ప్పుడు ధైర్యం చేసి ముంద‌డుగు వేయాల‌నిపించింది. స‌ముద్రంలోకి దూకిన‌ప్పుడు ఈత కొట్ట‌క‌పోతే చ‌నిపోతాం. బ‌త‌కాలంటే ఈదాల్సిందే. నేను కూడా ఈ సినిమా ప్రాసెస్‌లో అలాంటి ఓ ప్ర‌య‌త్నాన్ని చేశాను. ఇక్క‌డ‌కు రావ‌డానికి బాగానే ఈత కొట్టాన‌నిపించింది. ఈ ప్ర‌యాణం ఎగ్జ‌యిటింగ్‌గా అనిపించింది. ఆస్కార్ అవార్డ్ వ‌చ్చిన‌ప్పుడు అంద‌రూ న‌న్ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. నాలుగైదేళ్లు నేను హాలీవుడ్‌కే ప‌రిమితం అయ్యాను. నేను అకాడ‌మీ స‌భ్యుడిగా మారాను. హాలీవుడ్‌కి చెందిన టాప్ టెక్నీషియ‌న్స్‌ను క‌లుసుకున్నాను. నేను చాలా వ‌ర్క్ షాప్స్‌లో పాల్గొన్నాను. కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఈ ప్ర‌యాణంలో నేను గ‌మ‌నించిన విష‌యాల‌న్నీ ఈ సినిమాకు ప్ర‌ధానాంశాలుగా మారాయి. నేను తెలుగు సినిమాల‌ను ఇష్ట‌ప‌డ‌తాను. బెస్ట్ మూవీ వ‌చ్చిన‌ప్పుడు త‌ప్ప‌కుండా చేస్తాను.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Wild Dog In OTT: మే మూడోవారంలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నాగార్జున వైల్డ్ డాగ్ మూవీ..

అందం.. అభినయం ఉన్నా అదృష్టం.. అవకాశాలు రెండు ఈ అమ్మడిని పలకరించడంలేదు ఎందుకో…