Bollywood : హీరోయిన్స్‌లో ఆమె తోపు.. అత్యధిక టాక్స్ కట్టేది ఆ స్టార్ బ్యూటీనే..

ఇంతకుముందు నటీమణులు నటనపై మాత్రమే దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమాలతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ కు ఇతర బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ అందరూ.. సొంత బ్రాండ్లను కలిగి ఉన్నారు. తక్కువ సినిమాలే చేసిన కోట్లల్లో సంపాదిస్తున్నారు హీరోయిన్స్. 

Bollywood : హీరోయిన్స్‌లో ఆమె తోపు.. అత్యధిక టాక్స్ కట్టేది ఆ స్టార్ బ్యూటీనే..
Bollyaood Actress
Follow us

|

Updated on: Sep 06, 2024 | 6:11 PM

పెళ్లి, పిల్లల తర్వాత నటి కరీనాకపూర్ మునుపటిలాగా సినీ పరిశ్రమలో యాక్టివ్‌గా లేరు. అడపాదడపా సినిమాలు ఒప్పుకుంటున్నారు. అయితే ఈ హాట్ బ్యూటీ ఇతర బిజినెస్లలో చాలా చురుకుగా ఉంటుంది. కరీనా చాలా బిజినెస్ లలో పార్ట్నర్ గా ఉంది. అంతే కాదు.. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఈ ముద్దుగుమ్మ మొదటి స్థానంలో ఉంది. ఇంతకుముందు నటీమణులు నటనపై మాత్రమే దృష్టి పెట్టేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. సినిమాలతో పాటు ఇతర వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెడుతున్నారు. చాలా మంది హీరోయిన్స్ కు ఇతర బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్స్ అందరూ.. సొంత బ్రాండ్లను కలిగి ఉన్నారు. తక్కువ సినిమాలే చేసిన కోట్లల్లో సంపాదిస్తున్నారు హీరోయిన్స్.

ఇక కరీనాకపూర్ విషయానికొస్తే.. సినిమాల్లో తిరుగులేని హీరోయిన్ గా రాణించింది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఈ మధ్య కాస్త స్పీడ్ తగ్గించిన కరీనా కపూర్.. అడపాదడపా సినిమాలు చేస్తోంది. ఇక ఈ ముద్దుగుమ్మ  ఏడాదికి  రూ.20 కోట్లు పన్ను చెల్లిస్తుంది. సినిమాలతో పాటు బ్రాండ్ ప్రమోషన్, బిజినెస్, రియల్ ఎస్టేట్ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదిస్తుంది ఈ చిన్నది. ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌ వివాహం చేసుకున్న తర్వాత, ఆమె చాలా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టింది.

కరీనా తర్వాత కైరా అద్వానీ అత్యధిక టాక్స్ పెయిర్ గా ఉంది. కియారా అద్వానీ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ ఏడాది ఆమె  రూ.12 కోట్లు టాక్స్ పే చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తోంది. మరో ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ మూడో స్థానంలో ఉంది. ఈ అమ్మడు రూ.11 కోట్లు పన్ను చెల్లించింది. టాక్స్ పేయర్ హీరోల జాబితాలో షారుఖ్ ఖాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆయన మొత్తం 92 కోట్ల రూపాయల పన్ను చెల్లించారు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్. 75 కోట్లు చెల్లించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.